'కరోనా వైరస్' విస్తరిస్తున్నా... జనం మందు కోసం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా పరిమిత ఆంక్షలతో నేడు మద్యం షాపులు తిరిగి తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. తెలంగాణ, ఝార్ఖండ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులు ఇవాళ తెరుచుకోలేదు.
కానీ మద్యం దుకాణాలు తెరిచిన రాష్ట్రాల్లో దుకాణాల వద్ద చూస్తే పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. మందుబాబులు పెద్ద సంఖ్యలో దుకాణాల వద్ద బారులు తీరారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ వైన్ షాపులు తెరుచుకున్నాయి. దీంతో లక్ష్మినగర్ లోని వైన్ షాప్ వద్ద పదుల సంఖ్యలో మందు బాబులు క్యూ కట్టారు. మళ్లీ మద్యం షాపులు ఎప్పుడు మూసివేస్తారోననే భయంతో ఎక్కువ మొత్తంలో బాటిళ్లు తీసుకోవడం కనిపించింది.
మరోవైపు కర్ణాటకలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. కర్ణాటకలోనూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. కొనుగోలుదారులు సామాజిక దూరం పాటిస్తూ మద్యం కొనుగోలు చేస్తున్నారు.
మరోవైపు ఢిల్లీలోని కశ్మీర్ గేట్ లో ఉన్న వైన్ షాప్ వద్ద మద్యం కొనుగోలు చేసేందుకు భారీ సంఖ్యలో కొనుగోలుదారులు వచ్చారు. సామాజిక దూరం పాటించకుండా ఇష్టం వచ్చినట్లు మందుకోసం ఎగబడ్డారు. దీంతో క్యూలో ఉన్న వారి మధ్యే గొడవ జరిగింది. ఫలితంగా అక్కడికి చేరుకున్న పోలీసులు వారిపై లాఠీఛార్జి చేశారు. మందుబాబులను చెదరగొట్టారు.
#WATCH: Police resorts to mild lathicharge outside a liquor shop in Kashmere Gate after social distancing norms were flouted by people outside the shop. #Delhi pic.twitter.com/XZKxrr5ThC
— ANI (@ANI) May 4, 2020