Pension Eligible Age: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ న్యూ సందర్భంగా గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని గిరిజనులు, దళితులకు 50 ఏళ్లు నిండిన వెంటనే పెన్షన్ అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాంచీలోని మోరబాది మైదాన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోరెన్ ఈ ప్రకటన చేశారు. గిరిజనులు, దళితులు 50 ఏళ్లు నిండిన తర్వాత వారికి పెన్షన్ ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉందని.. 60 ఏళ్లు దాటినా వారికి ఉద్యోగాలు లభించడం లేదని ఆయన అన్నారు.
"ఈ నిర్ణయం రాష్ట్రంలోని బలహీన గిరిజన సమూహాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 2000లో జార్ఖండ్ రాష్ట్రంగా అవతరించిన 20 ఏళ్లలో కేవలం 16 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ప్రయోజనాలు లభించాయి. అయితే తమ ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను పెంచింది. ఇప్పుడు 36 లక్షల మందికి పింఛను అందజేస్తున్నాం. ప్రభుత్వ పథకాల ఫలాలను లబ్ధిదారుల ఇంటి వద్దకే అందించడమే మా ప్రభుత్వ పథకం ఉద్దేశం.." అని సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. రాష్ట్రంలో ఐదు కేటగిరీల వారికి పెన్షన్ ఇస్తున్నామని.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,400 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
ఈ సందర్భంగా రూ.4,547 కోట్లతో చేపట్టిన 343 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా చేశారు. జార్ఖండ్‌లో యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని సీఎం మండిపడ్డారు. యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
వృద్ధాప్య పింఛన్ ప్రయోజనం పొందాలంటే జార్ఖండ్ నివాసి కావాల్సిందేనని సీఎం తెలిపారు. ట్యాక్స్ చెల్లించే వ్యక్తులు పెన్షన్‌ను అనర్హులు. ప్రభుత్వ పెన్షన్ ప్రయోజనాన్ని పొందేవారు.. మరే ఇతర పెన్షన్ ప్రయోజనాన్ని పొందకూడదు. మార్చి 2023 వరకు 14.25 లక్షల మంది లబ్ధిదారులు పెన్షన్ అందుకున్నారు. కాగ్ నివేదిక ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ద్వారా రూ.69,722 కోట్లు సాయం అందుకుంది. ఇందులో 40 శాతం జీతాలకు, అలవెన్సులు, పింఛన్లు, అభివృద్ధి పథకాలకు లోన్లపై వడ్డీ చెల్లింపులకు ప్రభుత్వం ఖర్చు చేసింది. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం జీత భత్యాల కోసం రూ.13,979 కోట్లు, పెన్షన్ చెల్లింపులకు రూ.7614 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.6,286 కోట్లు కేటాయించింది.
Also Read: Ys Sharmila: వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి ఫిబ్రవరి 17న, ప్రకటించిన వైఎస్ షర్మిల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter