Elections Survey: దేశ ప్రజలకు PINEWZలో అద్భుత ఛాన్స్‌.. ఎన్నికలపై మీ అభిప్రాయం తెలిపే సదావకాశం

Lok Sabha Election 2024 Survey: ఎప్పటికప్పుడు నిరంతర వార్తా ప్రసారాలతోపాటు విశేషాలు, ప్రపంచంలో జరిగే పరిణామాలను వేగంగా అందిస్తున్న జీన్యూస్‌ మరో ప్రజా ప్రయత్నం చేపట్టింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఓ సర్వే చేపడుతోంది. దీనిలో ప్రజలు కూడా భాగస్వామ్యులు కావాలని 'జీ న్యూస్‌' పిలుపునిస్తోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 15, 2024, 10:06 PM IST
Elections Survey: దేశ ప్రజలకు PINEWZలో అద్భుత ఛాన్స్‌.. ఎన్నికలపై మీ అభిప్రాయం తెలిపే సదావకాశం

Lok Sabha Elections 2024 Survey In PINEWZ: ప్రస్తుతం భారతదేశమంతా ఎన్నికల హడావుడి నెలకొంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు అనేక వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి ఓటరు ఎవరికీ పట్టం కట్టబోతున్నాడని యావత్‌ దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంలోనే దేశంలోనే అతిపెద్ద మీడియా సంస్థ అయిన 'జీ న్యూస్‌' ఒక దేశ ప్రజలకు సువర్ణ అవకాశం కల్పిస్తోంది. మీరైతే ఎవరికీ ఓటేస్తారో అని సర్వే చేపడుతోంది.

Also Read: KCR Birth Day: ఆటో డ్రైవర్లకు కేసీఆర్‌ జన్మదిన 'కానుక' రూ.10 కోట్లు .. 17న గులాబీ పండుగ

దేశ ప్రజలకు జాతీయ మీడియా సంస్థ అయిన 'జీ న్యూస్‌' ఈ అరుదైన అవకాశం కల్పిస్తోంది. సాధారణ ప్రజల నుంచి నేరుగా అభిప్రాయ సేకరణ చేపట్టేందుకు ముందుకువచ్చింది. దేశంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయడానిక సర్వే నిర్వహిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలపై మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయండి. మీ ఓటు దేశ భవిష్యత్‌కు ఒక మార్పు కావొచ్చు. మీరు ఎవరి పక్షమో తెలుసుకునేందుకు జీ న్యూస్‌ ఇటీవల ప్రారంభించిన హైపర్‌ లోకల్‌ యాప్‌ PINEWZ ద్వారా సర్వే నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని నేరుగా తెలియజేసే అవకాశం కల్పిస్తోంది.

Also Read: IndiGo Screw Sandwich: శాండ్‌విచ్‌లో ఇనుప బోల్ట్‌, స్క్రూ.. ఇలా ఉంటే ఎలా తినాలిరా అయ్యా!

మీ అమూల్యమైన ఓటు 2024 ఎన్నికల్లో ఎవరికి వేస్తారో PINEWZ సర్వేలో పాల్గొనడం ద్వారా తెలపవచ్చు. ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో తెలిపే ప్రయత్నం ఇది. PINEWZ ద్వారా దేశ ప్రజల నాడీ ఎలా ఉందో తెలుసుకోవడానికి జీ న్యూస్‌ ఒక సదావకాశం కల్పించింది. దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సర్వేలో మీతోపాటు మరికొంతమందిని భాగస్వామ్యంచేయండి. ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో పాల్గొని దేశ రాజకీయాలపై మీ అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలపవచ్చు. సర్వేలో పాల్గొనడం ద్వారా తదుపరి నాయకుడు ఎవరు అనేది స్పష్టంగా తెలియజేసేందుకు ఈ ప్రయత్నం. మీరు పాల్గొనండి.

సర్వేలో ఇలా పాల్గొనాలి..

  • గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ నుంచి PINEWZ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • డౌన్‌లోడ్‌ అనంతరం యాప్‌ను తెరచి మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి.
  • అనంతరం మీ అధికారిక నంబర్‌ను నమోదు చేయాలి.
  • ఇప్పుడు మీ ప్రొఫైల్‌ పేరును నమోదు చేయాలి.
  • అనంతరం యాప్‌లో ఇచ్చిన లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన 'క్లిక్‌ హియర్‌' అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • తర్వాత యాప్‌ అందించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఇలా మీరు మీ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు.

PINEWZ హైపర్‌ లోకల్‌ యాప్‌
జీ న్యూస్‌కు చెందిన PINEWZ యాప్‌ హైపర్‌ లోకల్‌కు సంబంధించినది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్టను పురస్కరించుకుని ఎస్సెల్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ సుభాష్‌ చంద్ర PINEWZ యాప్‌ను ప్రారంభించి దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ యాప్‌లో మీరు జాతీయ వార్తలు మొదలుకుని ఢిల్లీ వార్తల వరకు పొందవచ్చు. మీ స్థానికంగా ప్రతి గ్రామం, ప్రతి ప్రాంతానికి సంబంధించిన వార్తలను కూడా చూడవచ్చు. 

దేశంలోనే అతిపెద్ద జీ న్యూస్‌ ఛానళ్లతోపాటు ఇతర ప్రాంతీయ న్యూస్‌ ఛానళ్లు డాక్టర్‌ సుభాష్‌ చంద్ర ఆధ్వర్యంలో ప్రజలకు నిరంతరం వార్తా విశేషాలను అందిస్తున్నాయి. వాటితోపాటు ఇండియా.కామ్‌, డీఎన్‌ఏ వంటి వెబ్‌సైటలు కూడా వార్తలపై ప్రజలకు అవగాహన కల్పించే ఐడీపీఎల్‌ కూడా సుభాష్‌ చంద్ర నేతృత్వంలోనే పని చేస్తున్నాయి. తాజాగా కొత్త హైపర్‌ లోకల్‌ యాప్‌ PINEWZని దేశ ప్రజల కోసం ప్రారంభించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News