EPFO Pension: పీఎఫ్ ఖాతాదారులకు షాక్.. పెన్షన్ పెంపు ప్రతిపాదన తిరస్కరణ

Finance Ministry Rejects EPFO Pension Proposal: పీఎఫ్ పెంపు ప్రతిపాదనను ఆర్థిక శాఖ తిరస్కరించింది. దీంతో అధికారులతో పార్లమెంటరీ కమిటీ వివరణ కోరనుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2022, 03:43 PM IST
EPFO Pension: పీఎఫ్ ఖాతాదారులకు షాక్.. పెన్షన్ పెంపు ప్రతిపాదన తిరస్కరణ

Finance Ministry Rejects EPFO Pension Proposal: పీఎఫ్ ఖాతాదారులకు ఎదురుదెబ్బ తగిలింది. ఈపీఎఫ్ఓ ఖాతాదారుల పెన్షన్ పెంపును ఆర్థిక శాఖ నిలిపివేసింది. దేశంలో ఉన్న 6 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు ఉండగా.. వీరికి పెన్షన్ పెంచాలని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను తిరస్కరించింది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్ కింద రూ.1,000 పెన్షన్ వస్తోంది. 

పెన్షన్ అమౌంట్‌ను పెంచాలని పీఎఫ్ ఖాతాదారులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ పెన్షన్ పెంపునకు ప్రతిపాదనలు పంపించింది. అయితే ఎంత పెంచాలని కోరిందనే విషయంపై అధికారిక సమాచారం బయటకు రాలేదు. రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరస్కరించడంతో పీఎఫ్ ఖాతాదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి వివరణ కోరాలని పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. అధికారులందరినీ పిలిచి కమిటీ వివరణ కోరనుంది. 

కాగా ఇటీవలె 2021-22 ఏడాదికి వడ్డీని జమ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వెల్లడించింది. క్రెడిట్ చేసిన వడ్డీ త్వరలో లబ్ధిదారుల యూఏఎన్ లేదా ఈపీఎఫ్ ఖాతాలలో చూపిస్తుందని పేర్కొంది. ఎప్పుడు వడ్డీ జమ చేస్తారని ఓ నెటిజన్ ట్విట్టర్‌లో ప్రశ్నించగా.. వడ్డీ జమ చేసే ప్రక్రియ ప్రారంభమైందని రిప్లై ఇచ్చింది. త్వరలోనే మీ అకౌంట్స్‌లో జమ చేసిన మొత్తం చూపిస్తుందని సమాధానం ఇచ్చింది. వడ్డీ ఎప్పుడు జమ చేసినా.. పూర్తిగా చెల్లిస్తామంది. మీ వడ్డీకి ఎలాంటి నష్టం ఉండదని.. రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ EPFO ​​ద్వారా సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేయడం వల్ల వడ్డీని జమ చేయడంలో ఆలస్యం జరిగింది.

Also Read: Chandragrahanam Effect: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. ఈ నెల 8న శ్రీవారి ఆలయం మూసివేత  

Also Read: CM KCR Videos: జబర్దస్త్ కామెడీ షో.. సీఎం కేసీఆర్ వీడియోలపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ కౌంటర్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News