'పద్మావతి' సినిమా ను ఏ ముహూర్తాన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మొదలుపెట్టాడా గానీ.. సినిమాకు కష్టాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సినిమా ఇప్పుడే రిలీజ్ చేయం రా ముర్రో..! అని చెప్పినా తగ్గటం లేదు నిరసనకారులు. లేటెస్ట్ గా ఈ సినిమాపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 'నో' చెప్పేశారు. సినిమా విడుదల కాకుండానే నిషేధం విధించిన మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. కర్ణిసేన అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ఆ క్రమంలోనే రాజ్ పుత్ కర్ణిసేన వర్గానికి చెందిన నేతలు సీఎం చౌహాన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దాంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం దీపికా పదుకొనె ప్రధాన పాత్రధారిగా నటించిన 'పద్మావతి' చిత్రాన్ని ప్రదర్శించబోము అని సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉండగా, రాజ్ పుత్ కర్ణిసేన, ఇతర ప్రజాసంఘాలు చెప్పినట్లు అందులో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటే సినిమా విడుదలను ఆపేస్తామని రాజస్థాన్ సీఎం వసుంధర రాజే ప్రకటించిన సంగతి తెలిసిందే..!
#WATCH:Madhya Pradesh CM Shivraj Singh Chouhan says the film which has distorted facts against #Padmavati, will not be released in the state pic.twitter.com/NOBXj6WF3P
— ANI (@ANI) November 20, 2017