Odisha High Court: అంగీకారంతో జరిగితే..పెళ్లికి ముందైనా అత్యాతారం కాదు, ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు

Odisha High Court: ఒడిశా హైకోర్టు  సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లికి ముందు ప్రేమికుల మధ్య జరిగిన శృంగారం రేప్ కాదని స్పష్టం చేసింది. కేవలం ఏడు సందర్భాల్లోనే అత్యాచారంగా పరిగణించాలని తెలిపింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 9, 2023, 03:02 PM IST
Odisha High Court: అంగీకారంతో జరిగితే..పెళ్లికి ముందైనా అత్యాతారం కాదు, ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు

ప్రేమికులు, శృంగారం విషయంలో ఒడిశా హైకోర్టు కీలకతీర్పు ఇచ్చింది. ఇద్దరు ప్రేమికులు ఏదైనా కారణాలతో విడిపోయాక..ప్రేమికుడిపై ప్రియరాలు అత్యాచారం కేసు పెడితే చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఒడిశాలోని నిమపారా పోలిస్ స్టేషన్‌లో నమోదైన ఓ ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దిగువ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ పాణిగ్రహి కీలకమైన తీర్పు ఇచ్చారు. ఇద్దరు ప్రేమించుకుని, శారీరకంగా కలిసి ఏదైనా కారణంతో విడిపోతే..అది ఆ ఇద్దరి వ్యక్తిగత వ్యవహారం అవుతుంది. అంతేగానీ..యువకుడు వదిలేశాడనే కారణంతో యువతిపై అత్యాచారం కేసు పెడితే చెల్లుబాటు కాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇద్దరూ ఇష్టంతోనే శారీరకంగా కలిసినందున ఈ కేసుల్ని అత్యాచారంగా పరిగణించలేమని తెలిపింది హైకోర్టు.

గతంలో అంటే 2020 మే 24వ తేదీన కూడా జస్టిస్ పాణిగ్రహి ఇలాంటి తీర్పే ఇచ్చారు. అప్పట్లో కోరాపట్ జిల్లా పొట్టంగి పోలీస్ స్టేషన్ పరిధిలో దాఖలైన ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్ పాణిగ్రహి నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటామని భావించి కొందరు శారీరకంగా కలుస్తున్నారు. ఆ తరువాత పెళ్లికి నిరాకరిస్తే అత్యాచారం జరిగిందని భావిస్తే..పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇది కుదరదని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 375 ప్రకారం అత్యాచారానికి ఏడు కారణాలున్నాయి. ఆ కారణాలు ఇలా ఉన్నాయి. ఈ ఏడు కారణాల్లో ఉంటేనే ఆ కేసును అత్యాచారం కేసుగా పరిగణించాల్సి వస్తుంది. 

1. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా శృంగారం చేసినప్పుడు
2. ఆమె అనుమతి లేకుండా 
3. ఆమె సమ్మతితో, మరణ భయం లేదా బాధతో అనుమతించినప్పుడు
4. అంగీకారం లేకుండా భర్త బలవంతం చేస్తే
5. తప్పుదారి పట్టించి మత్తులో ఉన్నప్పుడు 
6. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు అమ్మాయితో 
7. మహిళ సమ్మతి తెలిపే స్థితిలో లేనప్పుడు

Also read: Ganga Vilas Cruise: ప్రపంచపు అతి పొడవైన నదీ మార్గపు క్రూయిజ్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News