కాంగ్రెస్ అభ్యర్ధి నోటాపై విజయం ఏంటని ఆలోచిస్తున్నారా..నోటాపైనే కాదు..మరో స్వతంత్ర అభ్యర్ధిపై కూడా విజయం దక్కించుకున్నారు. ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది కదూ..కానీ నిజమే. ఒడిశా ధామ్‌నగర్ ఉపఎన్నిక ఫలితమిది.
తెలంగాణలోని మునుగోడు సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. బీజేపీ ఇప్పటికే మూడు స్థానాలు కైవసం చేసుకోగా..టీఆర్ఎస్, ఆర్డేడీ, శివసేన పార్టీలు ఒక్కొక్క స్థానాన్ని గెల్చుకున్నాయి. ఈ ఏడు స్థానాల్లో మహారాష్ట్రలోని ఈస్ట్ అంథేరి, బీహార్‌లోని మోకమ, గోపాల్‌గంజ్, హర్యానాలోని అదంపూర్, తెలంగాణలోని మునుగోడు, ఉత్తరప్రదేశ్‌లోని గోల గోకర్నాథ్ , ఒడిశాలోని థామ్‌నగర్ ఉన్నాయి.
నోటాపై కాంగ్రెస్ విజయం
ఒడిశాలో కాంగ్రెస్ పార్టీ విచిత్రమైన రికార్డు నెలకొల్పింది. ధామ్‌నగర్ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సమీప నోటా, మరో స్వతంత్ర అభ్యర్ధిపై 12-13 వందల ఓట్ల మెజార్టీ నమోదు చేసింది.
ఒడిశా థామ్‌నగర్ ఉపఎన్నికలో వాస్తవానికి బీజేపీ అభ్యర్ధి సూర్యవంశి సూరజ్ 41 వేల వేట్లతో విజయం సాధించగా, రెండవ స్థానంలో నిలిచిన బిజూ జనతాదళ్ అభ్యర్ధి అబంతి దాస్ 35,824 ఓట్లు దక్కించుకున్నారు. ఇక ఇదే స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి బాబా హరేకృష్ణ సేఠికు కేవలం 1556 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే కేవలం 1.84 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. ఇది ఎంత అత్యల్పమంటే..అతనికంటే..ఓ స్వతంత్ర అభ్యర్ధి రాజేంద్ర కుమార్ దాస్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ.. సమీప నోటా కంటే దాదాపు 12 వందల ఓట్ల ఆధిక్యం సాధించడం విశేషం. మరో ఇండిపెండెంట్ అభ్యర్ధి పబిత్రా మోహన్ దాస్ కంటే 13 వందల ఓట్లు ఆధిక్యం సాధించారు. నోటాకు 0.4 శాతం ఓట్లు వస్తే..మరో స్వతంత్ర అభ్యర్ధికి 0.3 శాతం ఓట్లు వచ్చాయి.
దేశంలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ పరిస్థితి ఇదీ. డిపాజిట్ సంగతి దేవుడెరుగు..మరీ ఇంత అత్యల్పంగానా అని ఆశ్చర్యపోతున్న పరిస్థితి.
Also read: Munugodu Bypoll 2022: మునుగోడులో రౌండ్ రౌండ్‌కు మారిన ఫలితం, రౌండ్ల వారీగా కౌంటింగ్ ఫలితాలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Odisha Bypoll: ఒడిశా ధామ్‌నగర్ ఉపఎన్నికలో గెలిచిన కాంగ్రెస్..నోటాపై