Nupur Sharma: ప్రవక్తపై నుపుర్ అనుచిత వ్యాఖ్యలు.. భారత్‌కు అల్‌ఖైదా బెదిరింపు.. ఆ నగరాల్లో ఆత్మాహుతి దాడులకు ప్లాన్..

Al Qaeda Threatens India: ముస్లింల ఆరాధ్య దైవం మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ భారత్‌లో ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామని బెదిరింపులకు దిగింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 8, 2022, 07:39 AM IST
  • నుపుర్ శర్మ వ్యాఖ్యలపై కొనసాగుతున్న దుమారం
  • అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నుంచి భారత్‌కు బెదిరింపులు
  • పలు నగరాల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామని హెచ్చరికలు
Nupur Sharma: ప్రవక్తపై నుపుర్ అనుచిత వ్యాఖ్యలు.. భారత్‌కు అల్‌ఖైదా బెదిరింపు.. ఆ నగరాల్లో ఆత్మాహుతి దాడులకు ప్లాన్..

Al Qaeda Threatens India: ఓవైపు ముస్లిం దేశాల నుంచి భారత్‌పై తీవ్ర వ్యతిరేకత.. మరోవైపు ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు.. మహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా నుపుర్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశానికే ముప్పు తలపెట్టేలా మారాయి. తాజాగా అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. ప్రవక్త గౌరవం కోసం పోరాడేందుకు.. ఢిల్లీ సహా ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో ఆత్మాహుతి దాడులు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు అల్ ఖైదా నుంచి ఒక లేఖ విడుదలైంది.

'మహమ్మద్ ప్రవక్తను కించపరిచేవారిని చంపేస్తాం. మా శరీరాలకు, మా పిల్లల శరీరాలకు పేలుడు పదార్థాలు చుట్టి ప్రవక్తను అవమానించేవారిని పేల్చేస్తాం. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్‌లలో కాషాయ ఉగ్రవాదులు ఇప్పుడు వారి అంతం కోసం ఎదురుచూడాల్సిందే.' అని అల్ ఖైదా ఉగ్రవాదులు ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, మహమ్మద్ ప్రవక్త గౌరవార్థం ఇతరులు కూడా ఈ పోరాటంలో పాల్గొని ప్రాణాలర్పించాలని పిలుపునిచ్చారు.

అసలేంటీ వివాదం :

ఉత్తరప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు వివాదంపై ఇటీవల ఓ జాతీయ మీడియా ఛానెల్ నిర్వహించిన చర్చలో బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహావేశంతో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. నుపుర్ టీవీ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, ఇరాన్, ఖతర్ వంటి దేశాల నుంచి నుపుర్ వ్యాఖ్యలపై తీవ్ర స్పందన వ్యక్తమైంది. 

ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు నోటీసులు కూడా పంపించారు. కొన్ని దేశాల్లో అయితే భారత ఉత్పత్తులపై నిషేధం విధించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో బీజేపీ నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. నుపుర్ శర్మను పార్టీ నుంచి తప్పించింది. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. భారత్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని తెలిపింది. బీజేపీ చేసిన ఈ ప్రకటనపై కొన్ని దేశాలు సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు.ఈ క్రమంలో తాజాగా ఉగ్రవాదులు సైతం నుపుర్ వ్యాఖ్యలపై స్పందించడం.. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించడం కలకలం రేపుతోంది. 

Also Read: Horoscope Today June 8th : నేటి రాశి ఫలాలు... ఆ రాశి వారికి లవ్ ప్రపోజ్‌కు అనుకూలమైన రోజు...

Also Read: ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News