Rain Alert: పశ్చిమ హిమాలయాల్లో వెస్టర్న్ డిస్ట్రబెన్స్, ఉత్తరాదిన మోస్తరు వర్షాలు

Rain Alert: ఓ వైపు ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిన ఎండల తీవ్రత పెరుగుతోంది. మరోవైపు వెస్టర్న్ డిస్ట్రబెన్స్ కారణంగా ఉత్తరాదిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 31, 2024, 11:39 AM IST
Rain Alert: పశ్చిమ హిమాలయాల్లో వెస్టర్న్ డిస్ట్రబెన్స్, ఉత్తరాదిన మోస్తరు వర్షాలు

Rain Alert: దేశమంతా వేసవి ప్రతాపం పెరుగుతోంది. ఉత్తరాదిన వివిధ రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. ముఖ్యంగా పశ్చిమ హిమాలయ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మార్చ్ 27 నుంచి అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. 31 వరకూ ఇదే పరిస్థితి ఉంటుంది. 

వెస్టర్న్ డిస్ట్రబెన్స్ కారణంగా ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వాతావరణం మారింది. ఓ వైపు ఎండలు తీవ్రంగా ఉన్న తరుణంగా వాతావరణం చల్లబడి వర్షాలు కురవడంతో జనానికి ఊరట లభించింది. ముఖ్యంగా మూడ్రోజుల్నించి అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. దేశంలో అస్సోం, మేఖాలయ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, మిజోరాం, కేరళ, నాగాలాండ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో మాత్రం భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అస్సోం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి.

మరోవైపు జమ్ము కశ్మీర్, లడఖ్, గిల్గిట్ బాలిస్తాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిశాయి. మొత్తానికి వెస్టర్న్ డిస్ట్రబెన్స్ కారణంగా వేసవి కాలంలో ఉత్తరాదిన మోస్తరు వర్షాలు పడటంతో వాతావరణం చల్లబడింది. ఇవాళ కూడా ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో వర్షాలు పడవచ్చని ఐఎండీ వెల్లడించింది. 

Also read: Punjab Girl Dies: ఘోర విషాదం.. పుట్టినరోజున కేక్ తిని చిన్నారి మృతి, ఫ్యామిలీ సీరియస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News