COVID-19 vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై స్పష్టత వచ్చేసింది

Vaccine for COVID-19 : న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఇండియాలో కోవిడ్-19కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కరోనావైరస్‌పై ( Coronavirus ) కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘానికి శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

Last Updated : Jul 11, 2020, 10:02 AM IST
COVID-19 vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై స్పష్టత వచ్చేసింది

Vaccine for COVID-19 : న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఇండియాలో కోవిడ్-19కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కరోనావైరస్‌ నివారణకు ( Coronavirus ) కేంద్రం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘానికి శాస్త్రవేత్తల బృందం తెలిపింది. భారత ప్రధాన శాస్త్రీయ సలహాదారు, బయోటెక్నాలజీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ ( CSIR ) శాస్త్రవేత్తల బృందం కరోనావైరస్ నివారణ, ప్రభుత్వ సన్నద్ధత, కరోనావైరస్ నివారణకు వ్యాక్సిన్ తయారీపై శుక్రవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి తాజా పరిస్థితిని వివరించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీ సమావేశానికి మరో ఆరుగురు సభ్యులు హాజరయ్యారు. మార్చి నెలాఖరులో లాక్‌డౌన్ ( Lockdown ) విధించిన తర్వాత కరోనావైరస్ వ్యాప్తిపై ఈ కమిటీ భేటీ అవడం ఇదే తొలిసారి. ( Also read: Telangana: కరోనా లేటెస్ట్ హెల్త్ బులెటిన్ అప్‌డేట్స్ )

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ( Vice president Venkaiah Naidu ) హర్షం వ్యక్తంచేశారు. కోవిడ్-19 టీకా తయారీలో ఆలస్యం జరుగుతున్నప్పటికీ.. ఆ ఆలస్యాన్ని నివారించడం అనేది ఎవ్వరి చేతుల్లోనూ లేని పరిస్థితి అని ఉప రాష్ట్రపతి ఆవేదన వ్యక్తంచేశారు. 

( Also read: TS secretariat: వాస్తు పేరుతో దారుణం: రేవంత్‌ రెడ్డి )

ఈ సమావేశంపై జైరాం రమేశ్ ( Jairam Ramesh ) ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. సమావేశం ఎంతో ఆశాజనకంగా కనిపించిందని తెలిపారు. ఒకవేళ వర్చువల్ మీటింగ్స్‌కి అనుమతి ఇచ్చి ఉంటే.. మరెంతో మంది ఎంపీలు పాల్గొని ఉండే వారని జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం జులై 15న సమావేశం కానుంది. ( Also read: ఏపీలో 25 వేలు దాటిన కరోనా కేసులు )

Trending News