సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం: నిర్మలా సీతారామన్‌

సైనిక దళాల ఆయుధ కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

Last Updated : Jun 6, 2018, 04:37 PM IST
సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం: నిర్మలా సీతారామన్‌

పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ధీటైన బదులిస్తామని భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. ఓవైపు సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ‌.. మరోవైపు చర్చలంటే కుదిరే పని కాదని అన్నారు. రంజాన్ సదర్భంగా సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉన్నా.. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్‌కు బుద్ధి చెప్పేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామని వెల్లడించారు.

'కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించి శాంతి వాతావరణం నెలకొంటేనే చర్చలు. లేకుంటే వారికి(పాకిస్థాన్) ధీటైన జవాబిస్తాం. సరిహద్దులను సురక్షితంగా ఉంచటం మా బాధ్యత. భారత్‌ కాల్పుల ఉల్లంఘన ఒప్పందానికి కట్టుబడి ఉంది' అని రక్షణ మంత్రి పేర్కొన్నారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా గడిచిన నాలుగేళ్లలో భారత రక్షణ రంగానికి అత్యధికంగా నిధులు వెచ్చించామని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. సైనిక దళాల ఆయుధ కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె పేర్కొన్నారు.  అటు రక్షణ రంగంలో భారత్ -రష్యా సహకారంపై స్పందించిన ఆమె... రాఫెల్ జెట్స్ కొనుగోళ్ళలో ఎటువంటి కుంభకోణం జరగలేదని.. ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోందన్నారు.

Trending News