కన్నీరు మున్నీరైనా నిర్భయ తల్లి

నిర్భయ దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడడంతో కోర్టు ఆవరణలో నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. కోర్టులు, ప్రభుత్వమే ఈ దోషులను కాపాడుతున్నాయిని నిర్భయ తల్లి ఆశాదేవి 

Last Updated : Jan 31, 2020, 10:18 PM IST
కన్నీరు మున్నీరైనా నిర్భయ తల్లి

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడడంతో కోర్టు ఆవరణలో నిర్భయ తల్లి ఆశాదేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. కోర్టులు, ప్రభుత్వమే ఈ దోషులను కాపాడుతున్నాయిని నిర్భయ తల్లి ఆశాదేవి ఆరోపించారు. శనివారం ఉదయం దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసి, ఉరిశిక్షకు అన్ని ఏర్పుట్లు చేసి కూడా ఈ నాటకాలేమిటని ఆమె మీడియాతో ఆవేశంగా మాట్లాడారు. ఒకడు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ వేస్తే, మరొకడు నేను మైనర్‌నని కోర్టులో స్టే వేస్తాడు.

ఎన్నిరోజులు తాత్సారం చేసి ఈ మానవమృగాలను మేపుతారంటూ ఆశాదేవి కోర్టుపై మండిపడ్డారు. తమ కూతుర్ని దారుణాతిదారుణంగా అత్యాచారం చేసిన ఆ దోషులకు ఉరిశిక్ష పడేంతవరకు విశ్రమించబోమని ఆమె సవాలు చేశారు. ఏడెనిమిదేళ్లుగా తమకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆమె విలపిస్తూ తన ఆందోళనను వెల్లడించారు. ఆ రాక్షసుల తరఫున వాదిస్తున్న లాయర్‌ ఏపి సింగ్‌, ప్రభుత్వం వారిని ఎన్ని రోజులు కాపాడతారో చూస్తామని ఆమె పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News