UPSC Exam: ఆ యూపీఎస్సీ అభ్యర్థులకు మరో ఛాన్స్ ఇవ్వలేము

UPSC Exam: No Extra Attempt For UPSC Preliminary Examination: కరోనా వైరస్ కారణంగా గత ఏడాది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరుకాని చివరి అవకాశం ఉన్న అభ్యర్థులకు మరోసారి ప్రిలిమ్స్ రాసే అవకాశం ఇవ్వలేమని కేంద్ర నిర్ణయం తీసుకుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 22, 2021, 04:42 PM IST
  • కోవిడ్-19 కారణంగా చివరి ప్రయత్నంలో హాజరు కాలేకపోయిన అభ్యర్థులకు మరో ఛాన్స్ లేదు
  • యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు నో చెప్పిన కేంద్ర ప్రభుత్వం
  • అఫిడవిట్‌లో విషయాలు వెల్లడించేందుకు కాస్త సమయం కోరిన అడిషనల్ సొలిసిటర్ జనరల్
UPSC Exam: ఆ యూపీఎస్సీ అభ్యర్థులకు మరో ఛాన్స్ ఇవ్వలేము

UPSC Exam: No Extra Attempt For UPSC Preliminary Examination: యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షలలో కోవిడ్-19 కారణంగా చివరి ప్రయత్నంలో హాజరు కాలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. గతంలో చెప్పిన విషయానికి, తాజాగా వెల్లడించిన నిర్ణయం వేరువేరుగా ఉన్నాయి.

జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ తరఫున హాజరై అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు ఈ విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. కరోనా కారణంగా గతేడాది UPSC పరీక్షకు హాజరుకాని వారికి మరో అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేమని చెప్పారు. దీనిపై వివరాల కోసం అఫిడవిట్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు.

Also Read: SBI Alert: పాన్ కార్డ్ అప్‌డేట్ చేయకపోతే ఈ ట్రాన్సాక్షన్స్ చేయలేరు 

 

సివిల్ సర్వీసెస్ అభ్యర్థి రచనా సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం జనవరి 25న విచారించనుంది. అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వడంపై యోచిస్తున్నామని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇటీవల సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనానికి తెలిపింది. కానీ ప్రస్తుతం తమ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చుకున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Singareni Jobs: సింగరేణిలో 372 పోస్టులు.. దరఖాస్తు చేసుకున్నారా

 

అక్టోబర్ 4న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. సెప్టెంబర్ 30 పరీక్ష వాయిదాపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. వాయిదా వేసే ప్రసక్తేలేదని స్పష్టం చేయడం తెలిసిందే. అయితే చివరి అకాశం ఉన్న అభ్యర్థులు కరోనా కారణంగా పరీక్షకు హాజరుకాలేని వారికి మరో అవకాశం ఇవ్వడంపై యోచించాలని కేంద్ర ప్రభుత్వానికి, యూపీఎస్సీకి సుప్రీంకోర్టు సూచించింది. 

Also Read: IRCTC: రైలు టికెట్లపై 10 శాతం డిస్కౌంట్.. ఎలాగో తెలుసా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News