Nirbhaya gangrape case convicts : నిర్భయ కేసు దోషుల ఉరి శిక్షకు మరో తేదీ ఖరారు

నిర్భయ కేసులో దోషులుగా ఉన్న వినయ్ శర్మ, అక్షయ్ థాకూర్, పవన్ గుప్త, ముఖేష్ సింగ్‌లకు ఉరి శిక్ష విధించేందుకు మరో తేదీని ఖరారు చేస్తున్నట్టు ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు స్పష్టంచేసింది.

Last Updated : Feb 17, 2020, 10:43 PM IST
Nirbhaya gangrape case convicts : నిర్భయ కేసు దోషుల ఉరి శిక్షకు మరో తేదీ ఖరారు

ఢిల్లీ: నిర్భయ కేసులో దోషులుగా ఉన్న వినయ్ శర్మ, అక్షయ్ థాకూర్, పవన్ గుప్త, ముఖేష్ సింగ్‌లకు ఉరి శిక్ష విధించేందుకు మరో తేదీని ఖరారు చేస్తున్నట్టు ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు స్పష్టంచేసింది. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాల్సిందిగా పటియాలా కోర్టు సోమవారం తుది తీర్పు చెప్పింది. నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో పటియాలా హౌజ్ కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి స్పందిస్తూ.. ఈ కేసులో ఇక ఇదే ఆఖరి తీర్పు అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు. నిర్భయ తండ్రి స్పందిస్తూ... నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో దోషులకు ఉరి పడాలని యావత్ దేశం కోరుకుంటుండటాన్ని హర్షించదగిన విషయం అని అన్నారు. దోషులకు ఇక ఉరి శిక్ష తప్పదని... తప్పు చేసిన వారికి శిక్షలు పడినప్పుడే నేరాలు అదుపులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News