Night curfew in Gujarat: గుజరాత్​లో రాత్రి పూట కర్ఫ్యూ- విద్యా సంస్థలకు సెలవులు

Night curfew in Gujarat: కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్​ అప్రమత్తమైంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఆంక్షలను విధించింది. విద్యా సంస్థలకు సెలవుల ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 08:38 AM IST
  • గుజరాత్​లో మరోసారి కఠిన కరోనా ఆంక్షలు
  • కేసుల వృద్ధితో అప్రమత్తమైన ప్రభుత్వం
  • విద్యా సంస్థలకు నెలాఖరు వరకు సెలవులు
Night curfew in Gujarat: గుజరాత్​లో రాత్రి పూట కర్ఫ్యూ- విద్యా సంస్థలకు సెలవులు

Night curfew in Gujarat: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో (Corona in India) వివిధ రాష్ట్రాలు కఠిన ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్​ కర్ఫ్యూలు విధించడం, విద్యా సంస్థలకు సెలవలు ప్రకటించడం వంటి చర్యలు చేపట్టాయి. ఇప్పుడు ఆ జాబితాలో గుజరాత్​ కూడా (Corona restirictions in Gujarat) చేరింది.

గుజరాత్​లో జనవరి 7 (శుక్రవారం) నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఆహ్మదాబాద్, సూరత్​, వడోదర, రాజ్​కోట్​​, గాంధీనగర్​, జునాగడ్, జామ్​నగర్, భావ్​నగర్, ఆనంద్​, నడియాద్ పట్టణాల్లో ఈ ఆంక్షలు (Night curfew imposed in Gujarat ) విధింంది ప్రభుత్వం.

ముఖ్యమంత్రి కార్యాలయం వెలువరించిన ప్రకటనలో.. అన్ని రాజకీయ, సామాజిక కార్యక్రమాలు, పెళ్లిళ్లకు గరిష్ఠంగా 400 మందికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. ఫంక్షన్​ హాళ్లు, కన్వెన్షన్లలో 50 శాతం కెపాసిటీతో వేడుకలు జరుపుకోవాలని (Corona rules in Gujarat) సూచించింది. అత్యక్రియల్లో పాల్గొనేవారి సంఖ్యను 100​గా నిర్ణయించింది.

వ్యాపార సముదాయాలపై ఆంక్షలు ఇలా..

రాష్ట్ర వ్యవ్యాప్తంగా షాపింగ్​ కాంప్లెక్స్​లు, హోటళ్లు, రెస్టారెంట్లు, 75 శాతం కెపాసిటితో పని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఇందుకు అనుమతి ఉంటుందని పేర్కొంది.

ప్రభుత్వ, ప్రైవేటు నాన్​ ఏసీ, ఏసీ బస్సులు 75 శాతం కెపాసిటీతో నడవాలని సూచించింది.

సినిమా  హాళ్లు, జిమ్​లు, స్విమ్మింగ్​ పూల్స్​కు 50 శాతం కెపాసిటీతో నడిచేందుకు అనుమతినిచ్చింది. 

ఇక విద్యా సంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు (Educational institutions closed in Gujarat) ప్రకటించింది. గుజరాత్​ హై కోర్టు సైతం వర్చువల్​గానే కేసులను విచారించనుంది.

రాష్ట్ర ఆరోగ్య శాఖ డేటా ప్రకారం.. రాష్ట్రంలో శుక్రవారం నాటికి 14,346 కరోనా యాక్టివ్​ కేసులు (Corona active cases in Gujarat) ఉన్నాయి.

Also read: Weekend Curfew: ఢిల్లీ, కర్ణాటకల్లో నేటి నుంచి వీకెండ్ కర్ఫ్యూ.. అమలులోకి ఈ నిబంధనలు..

Also read: Ahmedabad IIM Report: దేశంలో కరోనా మరణాలు 32 లక్షలకు పైనే.. సంచలనం రేపుతున్న సర్వే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News