Night curfew in Delhi: ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ.. ఏమేం అనుమతిస్తారంటే..

Night curfew in Delhi: న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. పెరుగుతున్న కొవిడ్-19 కేసులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రతీ రోజు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారిజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఢిల్లీ సర్కార్ (Delhi govt) స్పష్టంచేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2021, 02:44 PM IST
  • దేశ రాజధాని ఢిల్లీలో భారీగా పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 cases).
  • ఏప్రిల్ 30 వరకు నైట్ కర్ఫ్యూ విధించిన ఢిల్లీ సర్కార్.
  • నైట్ కర్ఫ్యూలో (Night curfew) ఎవరెవరిని అనుమతిస్తారు, ఏయే సేవలు అందుబాటులో ఉంటాయి ?
Night curfew in Delhi: ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ.. ఏమేం అనుమతిస్తారంటే..

Night curfew in Delhi: న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కారు అప్రమత్తమైంది. పెరుగుతున్న కొవిడ్-19 కేసులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రతీ రోజు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారిజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఢిల్లీ సర్కార్ (Delhi govt) స్పష్టంచేసింది. నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఢిల్లీ సర్కారు తమ ఆదేశాల్లో పేర్కొంది. అయితే, అత్యవసర సేవలను మాత్రం అనుమతించనున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం తేల్చిచెప్పింది.

నైట్ కర్ఫ్యూలో అనుమతించే సేవలు | services allowed during night curfew:
బస్సులు, మెట్రోరైలు, ఆటోలు, టాక్సీలు సహా ఇతర పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. అత్యవసర విభాగాల్లో సేవలు అందించే వారి రవాణా సౌకర్యార్థం ఈ సేవలు అనుమతిస్తున్నట్టు ఢిల్లీ సర్కారు వెల్లడించింది. 

ఎవరెవరిని అనుమతిస్తారు | People allowed:
ప్రైవేట్ డాక్టర్స్, నర్సులు, పారామెడికల్ స్టాఫ్‌కి నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు లభించింది. అయితే, వారు తప్పనిసరిగా తనిఖీలు చేపట్టే ఢిల్లీ పోలీసు సిబ్బందికి తమ ఐడి కార్డు చూపించాల్సి ఉంటుంది. అలాగే ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్స్, బస్సు స్టేషన్స్‌కి వెళ్లే ప్రయాణికులు తమ టికెట్ చూపించి వెళ్లవచ్చు. ప్రెగ్నెంట్స్, అతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లే రోగులను కూడా అనుమతిస్తారు.

Also read : India COVID19 Cases: భారత్‌లో కరోనా కలకలం, తొలిసారిగా లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదు

ఢిల్లీలో కరోనా కేసులు | COVID-19 cases in Delhi:
ఢిల్లీలో సోమవారం కొత్తగా 3,548 కరోనా కేసులు గుర్తించగా 15 మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఢిల్లీ సర్కార్ కరోనాపై పోరును మరింత సీరియస్‌గా తీసుకుంది. ఇటీవల కాలంలో కరోనా కేసులు పెరగడం మొదలైన తర్వాత ఆంక్షల విషయంలో ఢిల్లీ సర్కార్ తొలిసారిగా తీసుకున్న కఠిన నిర్ణయం ఇదే. 

ఢిల్లీలో లాక్‌డౌన్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందన | Lockdown in Delhi ?:
గత శుక్రవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి ఇంకా అదుపులోనే ఉంది అని అన్నారు. అంతేకాకుండా ఢిల్లీలో లాక్‌డౌన్ విధించే ఉద్దేశం ఢిల్లీ సర్కారుకు లేదని సీఎం కేజ్రీవాల్ స్పష్టంచేశారు.

Also read : Telangana COVID-19 Cases: తెలంగాణలో తాజాగా 1,498 కోవిడ్-19 పాజిటివ్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News