NIA raids 16 locations in jammu kashmir on helpers of terrorists: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) (NIA) మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. 21 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. జమ్మూకశ్మీర్ (jammu kashmir), ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని (uttar pradesh) పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇటీవల జమ్ము కశ్మీర్‌లో (jammu kashmir) సామాన్య పౌరుల హత్యలు, గుజరాత్‌లోని (Gujarat) ముంద్రా ఓడరేవులో రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత కేసుల దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ ఈ సోదాలు చేపట్టింది.
ఎన్‌ఐఏతో పాటు జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఉగ్రవాదులకు (Terrorists) అనుకూలంగా ఉండే నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టారు. జమ్మూకశ్మీర్‌లోని 16 ప్రాంతాల్లో ఈ దాడులు సాగాయి. లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, అల్ బదర్ వంటి టెర్రిరస్ట్ గ్రూప్స్‌తో సంబంధం ఉండే నెట్‌వర్క్‌ల అణచివేత లక్ష్యంగానే ఈ దాడులు చేపట్టారు. ఐదు రోజుల వ్యవధిలో కశ్మీర్‌లో(kashmir) మైనార్టీలు, స్థానికేతరులైన ఏడుగురు సాధారణ పౌరులను ఉగ్రవాదులు హత్య చేసిన విషయంత తెలిసిందే. అలాగే నిన్న జమ్మూకశ్మీర్‌లోని (Jammu Kashmir) పూంఛ్ జిల్లాలో ఎన్‌కౌంటర్ (encounter) జరిగింది. అందులో ఆర్మీ అధికారి సహా ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.
Also Read : Pushpa Movie Song: 'చూపే బంగారమాయెనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే'.. రెండో సాంగ్
ఇక కొద్ది రోజుల క్రితం ముంద్రా ఓడరేవులో (mundra port) రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుకున్నారు. ఈ విషయం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ కేసు కూడా ఎన్‌ఐఏకి (NIA) చేరింది. ఈ దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్‌లోని ఐదు ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ తనిఖీలు చేపట్టింది.
Also Read : Mahesh Koneru Passed Away:మరో విషాదం..గుండెపోటుతో ప్రముఖ నిర్మాత హఠాన్మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి