New Civil and Criminal Laws: జూలై 1 నుంచి కొత్త నేర, న్యాయ చట్టాలు అమలు.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి వెల్లడి..

New Civil and Criminal Laws: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాలను అమల్లోకి తీసుకొచ్చే పనిలో పడింది. ఈ నేపథ్యంలో గత పార్లమెంట్ సెషన్ లో ఆమోదం పొందిన కొత్త న్యాయ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 17, 2024, 08:41 AM IST
New Civil and Criminal Laws:  జూలై 1 నుంచి కొత్త నేర, న్యాయ చట్టాలు అమలు.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి వెల్లడి..

New Civil and Criminal Laws: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పదేళ్లుగా పలు కీలక చట్టాలను చేస్తూ దేశాన్ని గాడిలో పెట్టే పనిలో పడింది. అందుకే ఎపుడో బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న సివిల్, క్రిమినల్ చట్టాల ప్లేస్ లో  కొత్తగా ‘భారతీయ న్యాయ సంహిత’, ‘భారతీయ సురక్షా సంహితా’,  ‘భారతీయ సాక్ష్య అధినియం’  వచ్చే నెల జూలై 1 నుంచి అమల్లోకి రాబోతున్నట్టు కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మీడియాకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 125 రోజుల ప్రణాళికలో భాగంగా కొత్త నేర న్యాయ చట్టాలను జూలై 1 నుంచి అమ్లలోకి తీసుకురాబోతున్నారు.

ఇప్పటి వరకు మన దేశంలో బ్రిటిష్ వలసవాదం నాటి ఐపీసీ (ఇండియన్ పీనల్  కోడ్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లలో మార్పులు చేసారు. లా కమిషన్ చేసిన సూచనల ఆధారంగా మూడు చట్టాల్లో మార్పులు చేసినట్టు వెల్లడించారు. ఈ మూడు చట్టాలు మన దేశానికి కొత్త దశా, దిశా నిర్దేశిస్తాయని చెప్పుకొచ్చారు. ఈ చట్టాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో పోలీసులకు, లాయర్లకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులుక ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఈ శిక్షణ ఇస్తుందని వెల్లడించారు.

మొత్తంగా జ్యూడియషియల్ అకాడమీలు, నేషనల్ లా యూనివర్సిటీలు సైతం ఈ విషయాల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. దేశంలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో ఇవి పూర్తి మార్పులు తీసుకురానున్నాయని తెలిపారు. భారతీయ సురక్ష సంహిత కింద నేరాల తీవ్రతను బట్టి ఇకపై పక్షం రోజుల నుంచి దాదాపు మూడు నెలల వరకు కస్టడిని పొడిగించనున్నారు. పాత బ్రిటిష్ ఐపీపీలో 511 సెక్షన్లు ఉంటే.. కొత్త భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లు  ఉండనున్నాయి. ఈ కొత్త బిల్లులో 20 నేరాలను చేర్చనున్నారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహితలో 532 సెక్షన్లు ఉండనున్నాయి. గతంలో సీఆర్పీసీలో 488 సెక్షన్లు మాత్రమే ఉన్నాయి. 177 ప్రొవిజన్ల స్థానంలో 9 కొత్త సెక్షన్స్.. 39 సబ్  సెక్షన్లు ను కొత్త చేర్చారు. భారతీయ సాక్ష్య అభిమాన్ లో పద్నాలుగు సెక్షన్లను పూర్తిగా మార్చివేసినట్టు తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలపై జరుగుతున్న దాడుల విషయమై ఇందులో ప్రత్యేకంగా కొన్ని చట్టాలను చేర్చినట్టు తెలిపారు.

Read more: Us man forceful sneeze: బాప్ రే.. గట్టిగా తుమ్మగానే.. పొట్ట చీల్చుకుని బైటపడ్డ పేగులు.. ఎక్కడో తెలుసా..?..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News