NEET PG 2023 News: ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్స్ (FAIMA) తరపున క్రింద కొంతమంది వైద్యులు నీట్ పీజీ పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఇకలో భాగంగా మార్చి 5న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా లోక్‌సభలో తెలిపారు.
నీట్ పీజీ నమోదుకు చివరి తేదీ కూడా నిన్న అంటే ఫిబ్రవరి 12న ముగిసింది కూడా. అయితే ఈ పరీక్షను వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు, ఈ పరీక్షను కనీసం నెల లేదా రెండు నెలలు వాయిదా వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నీట్ పీజీ 2023 పరీక్షను వాయిదా వేసే అవకాశం చాలా తక్కువ, ఎందుకంటే ఈ పరీక్ష షెడ్యూల్ ప్రకారం నిర్వహించబడుతుంది అంటూ ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మరోసారి పేర్కొన్నారు.
Your reply @mansukhmandviya is not proper.
Why just only one batch suffer the most because of COVID.
There is a “TRIAGE” protocol for emergencies, & “Damage Control Protocols” for coming out of Pandemic.
However, now his stand is clear it seems , NO POSTPONEMENT as of now. pic.twitter.com/MAxuWFPn57— Dr. Rohan Krishnan (@DrRohanKrishna3) February 10, 2023
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ లోక్ సభలో వైద్యుల డిమాండ్ మేరకు ఈ పరీక్షను వాయిదా వేస్తారా? అని ప్రశ్న లేవనెత్తగా పరీక్ష తేదీ మార్చి 5 అని, ఐదు నెలల క్రితం ప్రకటించామని మాండవీయ బదులిచ్చారు. ఈ పరీక్షలో ఏ విద్యార్థి వెనుకబడి ఉండకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీని ఆగస్టు 11 వరకు పొడిగించినట్లు మాండవీయ చెప్పారు. అయితే వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
అయితే, పరీక్షల వాయిదాకు సంబంధించి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ NBE ఇంకా ఎలాంటి అప్‌డేట్‌ను ఇప్పటివరకూ విడుదల చేయలేదు. అందువల్ల ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న సమాచారంపై ఆధారపడకుండా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని చెబుతున్నారు, అలా చేస్తే ఈ పరీక్షకు సంబందించిన ఎలాంటి అప్డేట్ ఉన్నా వెంటనే వారికి చేరుతుంది.
Also Read: Indian Army Recruitment 2023: ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్.. ఖాళీలు, అర్హత, చివరి తేదీ వివరాలు ఇవిగో..
Also Read: Pm Kisan Scheme 2023: కోట్లాది మంది రైతులకు గుడ్‌న్యూస్.. హోలీకి కేంద్రప్రభుత్వం గిఫ్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook