NEET 2023 Results: దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్ధులు ఆసక్తిగా ఎదురు చూసిన నీట్ 2023 పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఏపీ, తమిళనాడుకు చెందిన ఇద్దరు విద్యార్ధులు 720 పూర్తి మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. నీట్ 2023 ఫలితాల్ని https://neet.nta.nic.in/లో చెక్ చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షమే 7వ తేదీన జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహించి ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 20 లక్షల 38 వేల 596 మంది పరీక్షకు హాజరు కాగా, 11 లక్షల 45 వేల 976 మంది ఉత్తీర్ణులయ్యారు. ఏపీ, తమిళనాడుకు చెందిన ఇద్దరు విద్యార్ధులకు 720/720 మార్కులు సాధించి మొదటి ర్యాంకు పొందారు. ఏపీ విద్యార్ధి వరుణ్ చక్రవర్తి తమిళనాడుకు చెందిన ప్రభంజన్‌లు మొదటి ర్యాంకు సాధించారని ఎన్టీఏ వెల్లడించింది. ఇక ఈడబ్ల్యూఎస్ విభాగంలో ఏపీ విద్యార్ధి ప్రవధన్ రెడ్డి రెండవ ర్యాంకు సాధించారు.
అదే విధంగా ఎస్సీ కేటగరీలో కూడా ఏపీకు చెందిన కే యశశ్రీ రెండవ ర్యాంకు సాధించింది. నీట్‌లో అత్యధిక ర్యాంకులు సాధించిన విద్యార్ధులు యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవాళ్లని ఎన్టీఏ తెలిపింది. దేశవ్యాప్తంగా 11 లక్షల 45 వేల 976 మంది అభ్యర్ధులు అర్హత సాధిస్తే ఏపీ నుంచి 42 వేల 836 మంది తెలంగాణ నుంచి 42, 654 మంది ఉత్తీర్ణులయ్యారు. నీట్ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ కీను జూన్ 4న విడుదల చేసి..జూన్ 6 వరకూ అభ్యంతరాల్ని స్వీకరించింది ఎన్టీఏ. నీట్ 2023 పరీక్ష ఫలితాల్ని https://neet.nta.nic.in/ వెబ్‌సైట్ ద్వారా నేరుగా చెక్ చేసుకోవచ్చు.
Also read: DA Hike For Govt Employees: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, డీఆర్ పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook