Army vacant posts: ఆర్మీలో లక్ష, నేవీలో 11 వేల పోస్ట్​లు ఖాళీ: కేంద్రం

Indian Army Vacancies: ఆర్మీలో భారీగా ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2021, 09:36 AM IST
  • ఇండియన్​ ఆర్మీలో భారీగా ఖాళీలు
  • రాజ్యసభలో వెల్లడించిన ప్రభుత్వం
  • నేటీ, ఐఏఎఫ్​ ఖాళీల సంఖ్య కూడా వెల్లడి
Army vacant posts: ఆర్మీలో లక్ష, నేవీలో 11 వేల పోస్ట్​లు ఖాళీ: కేంద్రం

Personnel shortage in the armed forces: ఆర్మీలో ఆఫీసర్​ స్థాయిలో (Army vacant posts) 7,476 పోస్ట్​లు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. అదే విధంగా నేవీలో (Navy vacant posts) 621, ఎయిర్​ఫోర్స్​లో (IAF vacant posts) 1,265 పోస్ట్​లు ఖాళీలు ఉన్నాయని తెలిపింది. రాజ్య సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్​ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొన్నారు.

మొత్తం పోస్ట్​ల పరంగా ఆర్మీలో అత్యధిక ఖాళీలు ఉన్నట్లు చెప్పారు అజయ్ భట్(Minister of State for Defence Ajay Bhatt), ఆర్మీలో మొత్తం 97,177 ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. అన్ని రెజిమెంట్లలో కొరత ఉందని చెప్పుకొచ్చారు. నేవీలో 11,166 పోస్ట్​లు ఖాళీగా ఉండగా.. ఎయిర్​ఫోర్స్​లో 4,850 పోస్ట్​లు ఖాళీగా ఉన్నాయని వివరించారు.

ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు భట్.

యువతకు అవగాహన..

సాయుధ దళాలాలో చేరేలా యువతను ప్రోత్సహించేందుకు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలిపారు అజయ్​ భట్​. స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థల్లో మోటివేషన్​ క్లాస్​లు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు

 47 రిక్రూట్​మెంట్ ర్యాలీలు..

2020-21 రిక్రూట్​మెంట్ సంవత్సరంలో 47 ర్యాలీలు నిర్వహించినట్లు చెప్పారు భట్. ఇదే సమయంలో నేవీ ఒక బ్యాచ్ సెయిలర్ల రిక్రూట్​మెంట్​ చేపట్టినట్లు వెల్లడించారు. అదే విదంగా ఐఏఎఫ్ కూడా రిక్రూట్​మెంట్ చేపట్టినట్లు స్పష్టం చేశారు. కొవిడ్ సంక్షోభం కారణంగా కొన్ని రిక్రూట్​మెంట్లు ఆగిపోయినట్లు వివరించారు.

Also read: Nagaland firing: 'నాగాలాండ్ కాల్పుల ఘటన పొరపాటు- బాధ్యులపై చర్యలు తీసుకుంటాం'

Also read: Omicron cases in India: మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News