Toll Fee Hike: లోక్‌సభ 2024 ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా టోల్ గేట్ రేట్లను పెంచేసింది. దేశంలోని అన్ని రహదారులపై ఇవాళ రాత్రి నుంచి టోల్ ధరలు పెరగనున్నాయి.
దేశవ్యాప్తంగా ఇవాళ అంటే జూన్ 3, 2024 రాత్రి నుంచి టోల్ ధరలు పెంచుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఇవాళ రాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. వచ్చే ఏడాది అంటే 2025 మార్చ్ 31 వరకూ కొత్త టోల్ ధరలు కొనసాగనున్నాయి. టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచుతూ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకుంది. అంటే రాజమండ్రి నుంచి విశాఖపట్నం మద్య మూడు టోల్ గేట్లకు కలిపి ప్రస్తుతం లైట్ వెహికల్ కార్లకు 270 రూపాయలు అవుతుంటే ఇకపై మరో 13 రూపాయలు పెరగనుంది. అదే విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్యలో ఉన్న 4 టోల్ గేట్లకు కలిపి ప్రస్తుతం దాదాపుగా 6 వందల రూపాయలుంటే ఇకపై మరో 30 రూపాయలు అదనంగా పెరగనుంది. ప్రతి వంద రూపాయలకు 5 రూపాయల చొప్పున టోల్ రుసుమును జాతీయ రహదారుల శాఖ పెంచేసింది.
వాస్తవానికి ఏప్రిల్ 1 నుంచే టోల్ ధరల్ని పెంచాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయిచినా లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా సంస్థ వాయిదా వేసింది. దాంతో ఇప్పుడు ఎన్నికలు ముగియగానే టోల్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Also read: ZEE News Exit Polls 2024: ఢిల్లీ కోటలో జెండా పాతేదెవరు..? జీ న్యూస్ సర్వేలో సంచలన విషయాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook