NDPP Candidate Hekani Jakhalu becomes first woman MLA in Nagaland: మూడు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం ప్రారంభం అయిన విషయం తెలిసిందే. త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సంపాదించగా.. మేఘాలయలో సంగ్మా పార్టీ హవా కొనసాగుతోంది. అయితే ఓ మహిళ నాగాలాండ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు. 60 ఏళ్ల తర్వాత నాగాలాండ్‌లో ఓ మహిళ తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. తాజాగా వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ) అభ్యర్థి హెకానీ జఖాలు విజయం సాదించారు.
నాగాలాండ్‌లోని దిమాపూర్-III నియోజకవర్గం నుంచి హెకానీ జఖాలు విజయం సాధించారు. 47 ఏళ్ల జఖాలు 1500 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎల్‌జేపీ (రామ్ విలాస్)కు చెందిన అజెటో జిమోమిని ఆమె ఓడించారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ గెలుపొందడం ఇదే తొలిసారి. నాగాలాండ్ శాసనసభకు ఎన్నికైన తొలి మహిళగా హెకానీ జఖాలు రికార్డు సృష్టించారు. ఇక నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన మొత్తం 183 మంది అభ్యర్థుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. అందులో ఓ న్యాయవాది, ఓ సామాజిక కార్యకర్త ఉన్నారు.
గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వేతర సంస్థ 'యూత్‌నెట్ నాగాలాండ్'ని హెకానీ జఖాలు నడుపుతున్నారు. చదువుకోవాలనుకునే వేలాది మంది యువకులకు ఆమె అండగా నిలిచారు. అందరికీ సహాయం చేస్తున్నందున అత్యంత ప్రజాదరణ పొందారు. అలాగే ఈ ఎన్జీఓ రాష్ట్రంలోని యువతకు మంచి వ్యాపార అవకాశాలను అందిస్తుంది. 2018లో హెకానీ జఖాలు నారీ శక్తి పురస్కారంతో గుర్తింపు పొందారు. మంచి ఫాలోయింగ్ ఉన్న హెకానీ.. తాజాగా ఎన్నికల సంఘం ప్రకటనతోనే ఆమె విజయం ఖరారైంది.
60 ఏళ్ల క్రితం 1963లో నాగాలాండ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా దక్కింది. అప్పటినుంచి ఈ రాష్ట్రంలో 13 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగినా.. ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. రాష్ట్రంలో మొత్తం 13.17 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో 6.56 లక్షల మంది మహిళా ఓటర్లే ఉన్నారు. అయినా కూడా ఇప్పటివరకు అక్కడ ఒక్క మహిళా విజయం సాధించలేదు. 20 మంది మహిళలు పోటీ చేసి విఫలమయ్యారు. 2018లో అత్యధికంగా ఐదుగురు మహిళలు ఎన్నికల్లో బరిలోకి దిగగా.. ఈసారి నలుగురు పోటీ చేశారు.
Also Read: Tata Nexon Price: 90 వేల డౌన్ పేమెంట్‌తో టాటా నెక్సన్‌ని ఇంటికి తీసుకెళ్లండి.. పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.