Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు రెండోసారి కరోనా

Corona Virus: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ కు మరోసారి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2022, 05:47 PM IST
Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు రెండోసారి కరోనా

MP CM Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ మరోసారి కొవిడ్ (Covid-19) బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా స్వయంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి గతేడాది కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. 

"నేను ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే..కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం స్వీయ నిర్భందంలో ఉన్నాను. రాబోయే కొద్ది రోజులపాటు పనులన్నీ వర్చువల్‌గా నిర్వహిస్తాను. రేపు జరగబోయే రవిదాస్ జయంతి (Ravidas Jayanti) కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొంటాను" అని సీఎం హిందీలో ట్వీట్ చేశారు.

మధ్యప్రదేశ్ లో కొవిడ్ పాజిటివిటీ రేటు సోమవారం 2.4 శాతానికి తగ్గినట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆ రాష్ట్రప్రభుత్వం గత వారం అన్ని కొవిడ్ ఆంక్షలను ఎత్తివేసింది. సోమవారం రాష్ట్రంలో 1,760 కొత్త కరోనా వైరస్ కేసులు (Corona Cases in MP) వెలుగు చూశాయి.  మరో నాలుగు మరణాలు నమోదయ్యాయి.

ఇటీవల శివరాజ్‌సింగ్ చౌహాన్‌ (MP CM Shivraj Singh Chouhan) ముచ్చింతల్‌లోని సమతామూర్తి దివ్యక్షేత్రాన్ని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో  కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. 

Also Read: Hijab Controversy: హిజాబ్ వివాదంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా సంచలన కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News