న్యూఢిల్లీ: సినిమా థియేటర్లలో ఆడియెన్స్‌ని బెంబేలెత్తిస్తున్న టికెట్ల ధరలపై జీఎస్టీ పన్ను రేటు తగ్గించాలనే డిమాండ్‌పై కేంద్రం దృష్టిసారించింది కాబోలు.. నేడు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన 31వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో టికెట్ల ధరలపై విధిస్తున్న పన్ను రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ.100 వరకు వున్న టికెట్ల ధరపై విధిస్తున్న పన్నును 12% కి తగ్గించగా రూ.100 కన్నా ఎక్కువ ఖరీదైన టికెట్లపై విధిస్తున్న 28% పన్నును కూడా 18% పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. 2019 జనవరి 1వ తేదీ నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వస్తాయని స్పష్టంచేశారు.