చెన్నైలోని రాజాజీ హాల్ వద్ద తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలి వస్తున్న క్రమంలో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. భారీ జన సందోహాన్ని నిలువరించేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో డీఎంకే వర్గాలు, పార్టీ మద్దతుదారులు సంయమనం పాటించాల్సిందిగా కరుణానిధి తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కే. స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.
I request the cadre to remain calm, I did not want anything for myself. All I want is a fitting tribute to #Kalaignar: MK Stalin. #Karunanidhi pic.twitter.com/pSogz8GGDh
— ANI (@ANI) August 8, 2018
అధికారంలో ఉన్న వాళ్లు కుట్రలు పన్నుతున్నారని స్టాలిన్ వ్యాఖ్యానించడం ఒకింత చర్చనియాంశమైంది. తమకు అండగా నిలిచిన పార్టీ వర్గాలు శాంతియుత పద్ధతిలో సంయమనంతో వ్యవహరించాల్సిందిగా ఎం.కే. స్టాలిన్ పార్టీ మద్దతుదారులను కోరారు.
Those who are in power are trying to create chaos, but you have all shown the strength of the cadres. I appeal to everyone to maintain peace: MK Stalin. #Karunanidhi pic.twitter.com/dkQDKEyHB4
— ANI (@ANI) August 8, 2018
ప్రభుత్వంపై స్టాలిన్ పరోక్ష దాడి.. అభిమానులకు విజ్ఞప్తి!