Gang Rape: మహారాష్ట్రలో దారుణం...మైనర్‌ బాలికపై 400 మంది 6 నెలలుగా అత్యాచారం...

ఓ మైనర్‌ బాలికపై 400 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో చోటుచేసుకుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2021, 07:37 PM IST
  • మహారాష్ట్రలో అమానవీయ ఘటన
  • మైనర్ పై 400 మంది అత్యాచారం
  • కేసు నమోదు చేసిన పోలీసులు
Gang Rape: మహారాష్ట్రలో దారుణం...మైనర్‌ బాలికపై 400 మంది 6 నెలలుగా అత్యాచారం...

Minor girl Gang Rape: మహిళలపై నేరాలు రోజురోజూకు పెరిగిపోతున్నాయి. వావి వరసలు మరచి..మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవరినీ వదలట్లేదు ఈ కామాంధులు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా..ఆడవారిపై ఈ కీచకులు అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే ఒకటి వెలుగు చూసింది. 

మహారాష్ట్ర(Maharashtra)లో దారుణం చోటుచేసుకుంది. ఆరు నెలలుగా మైనర్‌ బాలికపై దాదాపు 400 మంది మృగాళ్లు అత్యాచారాని(Gang Rape)కి పాల్పడ్డారు. ప్రస్తుతం బాధితురాలు రెండు నెలల గర్భవతి(Pregnant). ఈ అకృత్యానికి ఒడిగట్టిన వారిలో ఓ పోలీసు అధికారి ఉండటం విశేషం.  

Also Read: Patan Girl Tonsured: ప్రేమికుడితో వెళ్లిపోయిన బాలికకు గుండుకొట్టించిన గ్రామస్థులు

వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర బీద్‌ జిల్లాకు చెందిన మైనర్‌ బాలిక తల్లి(Motherless minor girl) రెండు సంవత్సరాల క్రితం మరణించింది. ఈ క్రమంలో బాలిక తండ్రి ఆమెకు వివాహం చేశాడు. అత్తవారింట్లో బాధితురాలు ప్రత్యక్ష నరకం అనుభవించింది. బాధితురాలి మామ ఆమెను నిత్యం వేధించేవాడు. పెళ్లైన ఏడాది తర్వాత బాధితురాలు ఉద్యోగం కోసం అంబేజోగై పట్టణానికి వెళ్లింది. అక్కడ ఆమెకు ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు. ఉద్యోగం(Job) ఇప్పిస్తామని నమ్మబలికి.. బాధితురాలిని శారీరంగా లొంగదీసుకున్నారు. అక్కడితో ఆగని మృగాళ్లు దీని గురించి ఆమె భర్తకు చెప్తామని బెదిరిస్తూ.. వారి స్నేహితుల వద్దకు పంపేవారు.

Also Read: Karnataka: యువతి బలవన్మరణం..కాబోయే భర్త వేధింపులే కారణం..!

ఇలా వందలమంది మృగాళ్లు బాధితురాలిపై పైశాచిక చర్యకు పాల్పడ్డారు. దాదాపు 400 మంది బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడగా.. వీరిలో ఒక పోలీసు అధికారి కూడా ఉండటం గమనార్హం. నిందితుల బారి నుంచి ప్రాణాలతో బయటపడిన ఆమె రెండు నెలల గర్భిణి. పిండాన్ని తొలగించేందుకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రక్రియ కొనసాగుతోంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలికకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపడుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News