Asad versus Mamata: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. బీజేపీ వర్సెస్ టీఎంసీ ఆరోపణలే కాదు..ఇప్పుడు మజ్లిస్ వర్సెస్ టీఎంసీ విమర్శలు ఎక్కువవుతున్నాయి. మమతాపై అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
పశ్చిమ బెంగాల్(West Bengal)లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)..ముస్లిం మైనార్టీలకు చేసిందేమీ లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. బీజేపీకు అమ్ముడుపోయిన వ్యక్తులు బెంగాల్‌లో మైనార్టీల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న మమతా బెనర్జీ వ్యాఖ్యల్ని ఆయన తిప్పికొట్టారు. బెంగాల్‌లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ నేపధ్యంలో ఓ ఇంటర్వూలో అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో మైనార్టీలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీల అభ్యున్నతి, సంక్షేమం కోసం మమతా బెనర్జీ ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీలేదన్నారు. ఓట్లు కోసమే మమతా బెనర్జీ మైనార్టీల పేర్లు చెప్పుకుంటున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ అభ్యర్ధులు ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇవ్వలేదని అసదుద్దీన్ మండిపడ్డారు. ఎన్నికల సంఘానికి ( Election Commission) ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు కూడా పార్టీ అభ్యర్ధులు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించకుండా మమతా ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు నుంచే తమ పార్టీ నేతలను టీఎంసీ ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందని..అక్రమ కేసులతో జైళ్లకు పంపిందన్నారు. పార్టీ అభ్యర్ధులపై భౌతిక దాడులు కూడా చేసిందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం, హింసాత్మక ప్రవృత్తిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. అహంకార ధోరణి కారణంగా టీఎంసీ(TMC)పతనం ఇకపై ప్రారంభమైనట్టేననన్నారు.
రాష్ట్రంలో మైనార్టీలకు ఏళ్ల తరబడి రక్షణ కవచంలా నిలుస్తున్నట్టు మమత చెప్పుకోవడంలో వాస్తవం లేదన్నారు ఒవైసీ. గోద్రా అల్లర్లపై 2002 ఏప్రిల్ 30న లోక్‌సభలో జరిగిన చర్చలో నేటి ప్రధాని నరేంద్ర మోదీ( Narendra modi), నాటి ప్రదాని వాజ్‌పేయిలకు మమతా బెనర్జీ అండగా నిలిచారన్నారు. బీజేపీ(Bjp)నేతృత్వంలోని ఎన్డీయేలో మమతా బెనర్జీ కేంద్రమంత్రిగా పని చేశారని గుర్తు చేశారు. అసలు బీజేపీను పశ్చిమ బెంగాల్‌కు తీసుకొచ్చిన ఘనత మమతా బెనర్జీకే దక్కుతుందన్నారు.
Also read: Maharashtra: కరోనా ఎఫెక్ట్, పది, పన్నెండు స్టేట్ బోర్డు పరీక్షలు వాయిదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook