వారి కోసం శ్రామిక్ స్పెషల్ రైళ్లు..

దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు ఇతరులను ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు అనుమతించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే సూచించిన విషయం తెలిసిందే. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ

Last Updated : May 1, 2020, 07:20 PM IST
వారి కోసం శ్రామిక్ స్పెషల్ రైళ్లు..

న్యూఢిల్లీ: దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు ఇతరులను ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు అనుమతించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే సూచించిన విషయం తెలిసిందే. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ నోడల్ అధికారులను నియమిస్తుందని హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ద్వారా తెలిపింది. రైల్వే స్టేషన్లలో, రైళ్ళ లోపల సామాజిక-దూర నిబంధనలను పాటించాలని, రైల్వే మంత్రిత్వ శాఖ వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేసింది. 

Also read : Coronavirus పుట్టుకపై అమెరికా ఇంటెలీజెన్స్ కీలక ప్రకటన

కార్మిక దినోత్సవం (మే 1) సందర్భంగా, దేశవ్యాప్తంగా వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు, ఇతరులు ప్రయాణం చేయడానికి "శ్రామిక్ స్పెషల్" రైళ్లను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు నడుపుతారని, రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్ అధికారులను నోడల్ అధికారులకు కో-ఆర్డినేటర్లుగా నియమించిందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

Also read : సొంతూరికి వెళ్లాలని 150 కిమీ నడిచాడు.. దగ్గర్లోకి రాగానే కుప్పకూలి కన్నుమూశాడు!

కోవిడ్ -19 లక్షణాలు లేని వారిని అనుమతిస్తారని, సామాజిక-దూర నిబంధనలను పాటించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ప్రయాణీకులందరూ ఫేస్ మాస్క్ లు తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు భోజనం, తాగునీరు అందించబడుతుందని అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ గమ్యస్థానం చేరుకున్న ప్రయాణికులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్క్రీనింగ్, అవసరమైతే క్వారంటైన్ కు తరలిస్తారని మార్గదర్శకాలల్లో పేర్కొన్నారు 
దేశవ్యాప్తంగా సుమారు 10 మిలియన్ల వలస కార్మికులు చిక్కుకుపోయారని, ఈ కార్మికులను తరలించడానికి కేంద్రం సామాజిక దూర నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయబడితే సుమారుగా 500,000 బస్సులు అవసరమవుతాయని వేస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News