Meghalaya Election Results 2023: మేఘాలయలో ఓ ఎమ్మెల్యే కార్యాలయన్ని ఆయన సొంత పార్టీ కార్యకర్తలే నిప్పు పెట్టారు. కాన్రాడ్ సంగ్మా ఎన్‌పీపీ, బీజేపీ కూటమికి హెచ్‌ఎస్‌పీడీపీ ఎమ్మెల్యే మెథోడియస్ ద్ఖార్ షిల్లాంగ్ మద్దతు ఇవ్వడం కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. దీంతో కార్యాలయాన్ని సొంత పార్టీ కార్యకర్తలే తగలపెట్టారు. కొన్రాడ్, ఢఖర్, ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే షక్లియార్ వర్జ్రీ, సంగ్మా నాయకత్వంలో రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్న ఎన్‌పీపీ-బీజేపీ కూటమికి తమ మద్దతును ప్రకటించారు.
శుక్రవారం రాత్రి నగరంలోని లైతుంఖారా ప్రాంతంలోని డాఖర్ కార్యాలయంలోకి హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (హెచ్‌ఎస్‌పీడీపీ) ఆగ్రహంతో ఉన్న మద్దతుదారులు చొరబడి తగులబెట్టారని ఎన్‌పీపీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి టిన్‌సాంగ్ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారని ఆయన చెప్పారు.
హిన్నివ్‌ట్రెప్ ఇంటిగ్రేటెడ్ టెరిటోరియల్ ఆర్గనైజేషన్, హిన్నివ్‌ట్రెప్ యూత్ కౌన్సిల్ ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఎమ్మెల్యేలు హరించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే చర్యను తాము జరగనివ్వలేమని.. ఇది ప్రజల హక్కులకు విరుద్ధమన్నారు.
అంతేకాకుండా హెచ్‌ఎస్‌పీడీపీ మద్దతుదారులు శనివారం మోత్‌ఫరన్‌లో ఇద్దరు ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను కూడా దహనం చేశారు. ఖాసీ వర్గానికి చెందిన వ్యక్తిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్న హెచ్‌ఎస్‌పీడీపీ, హెచ్‌వైసీ నాయకులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు.
మేఘాలయలో ఫిబ్రవరి 27న 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. గురువారం ఫలితాలు వెలువడ్డాయి. ఎన్‌పీపీ 26 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) 11 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలు ఐదు చొప్పున సీట్లు సొంతం చేసుకోగా.. బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. కొత్తగా ఏర్పాటైన పార్టీ వాయిస్ ఆఫ్ పీపుల్స్ పార్టీ 4, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, పీడీఎఫ్ రెండు స్థానాలు గెలుచుకోగా.. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు.
Also Read: IMA On Antibiotics: భారీగా పెరుగుతున్న దగ్గు, జ్వరం కేసులు.. ఈ మందులు అస్సలు వాడకండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook