కానిస్టేబుల్ కిడ్నాప్, హత్య.. మళ్ళీ మొదలైన మావోయిస్టుల అలజడి..

తెలంగాణకు సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘఢ్ లో మావోయిస్టుల అలజడి మొదలయ్యింది. జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి)  విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గా మావోయిస్టుల చేత కిడ్నాప్ గావించబడ్డాడు. కాగా సుక్మా జిల్లాలోని అరగట్ట వద్ద కానిస్టేబుల్ సొంత గ్రామంలోనే కిడ్నాప్ కి గురయ్యాడని

Last Updated : Mar 12, 2020, 04:53 PM IST
కానిస్టేబుల్ కిడ్నాప్, హత్య.. మళ్ళీ మొదలైన మావోయిస్టుల అలజడి..

రాయ్ పూర్ : తెలంగాణకు సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘఢ్ లో మావోయిస్టుల అలజడి మొదలయ్యింది. జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి)  విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గా మావోయిస్టుల చేత కిడ్నాప్ గావించబడ్డాడు. కాగా సుక్మా జిల్లాలోని అరగట్ట వద్ద కానిస్టేబుల్ సొంత గ్రామంలోనే కిడ్నాప్ కి గురయ్యాడని పోలీసు అధికారులు తెలిపారు. కిడ్నాప్ చేసిన అసిస్టెంట్ కానిస్టేబుల్‌ను మావోయిస్టులు చంపినట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు. 

Read Also: Sensex: భారత స్టాక్ మార్కెట్లకు కరోనా దెబ్బ

విశ్వసనీయయ వర్గాల సమాచారం ప్రకారం, బుధవారం సాయంత్రం కానిస్టేబుల్ ఇంటి వద్ద సివిల్ దుస్తులు ధరించిన మావోయిస్టులు సంచరించినట్లు, ఆ క్రమంలోనే అతన్ని కిడ్నాప్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటన దోర్నపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని, మరణించిన కానిస్టేబుల్‌ కత్తి కన్నగా గుర్తించామని అన్నారు. 

Also Read: జడ్పీటీసీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్స్.. జిల్లాల వారీగా వివరాలు

గురువారం ఉదయం అరగట్ట సమీపంలోని అడవుల్లో అతని మృతదేహం కనిపించిందని, చేతులను తాడుతో కట్టి ఉన్నట్లు తమ అధికారులు గుర్తించారని సుక్మా జిల్లా ఎస్పీ శలాబ్ సిన్హా మీడియా సమావేశంలో విలేకరులతో తెలిపారు. తన భార్యతో కలిసి బుధవారం గ్రామ పంచాయతీకి హాజరయ్యేందుకు కానిస్టేబుల్ తన గ్రామాన్ని సందర్శించినట్లు స్థానికులు చెబుతున్నారని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read Also: IPL 2020: ఐపీఎల్‌కు విదేశీ క్రికెటర్లు దూరం!

Trending News