సీబీఐ నూతన డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. 1986 బ్యాచ్‌కు చెందిన మన్నెం నాగేశ్వరరావును సీబీఐ నూతన డైరెక్టర్‌గా నియమిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశా కేడర్ అధికారిగా పనిచేసిన నాగేశ్వరరావు గతకొంతకాలంగా సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లా మండపేట వాస్తవ్యులైన నాగేశ్వరరావు.. ప్రస్తుత డైరెక్టర్ అలోక్ వర్మ పదవిని స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం బాధ్యతలు చూస్తున్న అలోక్ వర్మతో పాటు ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాలను సెలవుపై పంపించిన అధికార వర్గాలు తాజా నిర్ణయం తీసుకున్నాయి.
గతంలో కూడా ఓ తెలుగు వ్యక్తి సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పేరు విజయరామారావు. ఆయన తర్వాత అదే హోదాలో డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మరో తెలుగు వ్యక్తి మన్నెం నాగేశ్వరరావు కావడం విశేషం. గతంలో ఆయన ఒడిశాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా కూడా సేవలు అందించారు. ప్రస్తుతం సీబీఐ అధికారుల్లో అంతర్గత పోరు జరుగుతున్నందున ఈ తాజా నిర్ణయాన్ని కేంద్రం తీసుకున్నట్లు పలువురు భావిస్తున్నారు.
మన్నెం నాగేశ్వరరావు ఉస్మానియా యూనివర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత మద్రాస్ ఐఐటిలో పీహెచ్‌డీ చేశారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా మన్నెం నాగేశ్వరరావును సీబీఐ నూతన డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు భారత ప్రభుత్వానికి అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్న లోక్ రంజన్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు.
సీబీఐ నూతన డైరెక్టర్‌గా తెలుగు తేజం