ఖద్దరు దుస్తులు కొనుగోలు చేయాలని ప్రధాని సూచన

Last Updated : Sep 26, 2017, 06:38 PM IST
ఖద్దరు దుస్తులు కొనుగోలు చేయాలని ప్రధాని సూచన

మన్ కి బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ అకాశవాణిలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూ అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ను పురస్కరించుకొని ఖద్దురు దుస్తులు ధరించాలని సూచించారు. దేశంలో చేనేత కార్మికులకు చేయూతనందిస్తామని పేర్కొన్నారు.  మత విశ్వాసాల పేరిట హింసా మార్గంలో నడవటాన్ని సహించేది లేదని మరోసారి తేల్చి చెప్పారు.

మన్ కీ బాత్‌కు మూడేళ్లు..

మన్ కీ బాత్‌ కార్యక్రమం ప్రారంభించి మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధాని మోడీ .. ఆకాశవాణి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మూడేళ్ల పయనంలో తాను అడిగినప్పుడల్లా విలువైన సలహా, సూచనలు ఇచ్చిన వారందరికీ ధన్యావాదాలు తెలిపారు.

Trending News