ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో ఓ యువకుడు ఢిల్లీలోని మెట్రో భవన్‌కి సమీపంలో ఉన్న టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. యువకుడు టవర్ ఎక్కి నిరసన తెలపుతుండటంతో ఏ క్షణం, ఏం జరుగుతుందా అనే ఉత్కంఠతో ఆ పరిసర ప్రాంతాల్లోని జనం భారీ సంఖ్యలో టవర్ చుట్టూ గుమిగూడారు. దీంతో టవర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సైతం స్తంభించింది. యువకుడు ఆందోళన చేపట్టిన కారణంగా ట్రాఫిక్ స్తంభించింది అని సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని అతడిని కిందికి దిగిరమ్మని విజ్ఞప్తిచేశారు. అయితే, యువకుడు మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ టవర్ పైనే ఉండిపోయాడు.
A man holding a banner reading 'AP(Andhra Pradesh) needs special status' climbs a tower near Metro Bhawan in Delhi. Police at the spot. pic.twitter.com/HsXy9VJnuy
— ANI (@ANI) July 27, 2018
ఓవైపు భారీ వర్షం కురుస్తుండటం, మరోవైపు టవర్ ఎక్కిన యువకుడు చెప్పులు ధరించి ఉండటంతో అతడు కింద జారి పడే ప్రమాదం లేకపోలేదని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.