Love Affair: స్నేహితుడి కోసం అమ్మాయిగా మారాడు.. కానీ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన లవర్.. అసలు స్టోరీ ఏంటంటే..?

Madhya Pradesh: ఇద్దరు యువకుల మధ్య ప్రేమ చిగురించింది. ఒకరితో మరోకరు ఎప్పుడు కలిసి ఉండాలనుకున్నారు. దీని కోసం ఎన్నో ప్లాన్ లు కూడా వేసుకున్నారు. సమాజం ఒప్పుకోకున్న కూడా ఒక్కటిగానే ఉండాలనుకున్నారు. మధ్య ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 22, 2024, 04:41 PM IST
  • - ఆన్ లైన్ లో మరో యువకుడితో రోజు చాటింగ్...
    - లింగమార్పిడి చేసుకొవాలని ఫోర్స్..
Love Affair: స్నేహితుడి కోసం అమ్మాయిగా మారాడు.. కానీ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన లవర్.. అసలు స్టోరీ ఏంటంటే..?

Love Affair Between Boys: యువత ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లికంటే కూడా లవ్  మ్యారెజ్ లు చేసుకొవటానికి యువత ఇష్టపడుతున్నారు. ప్రేమలో ఇద్దరు కలసి కొంత కాలం జర్నీ చేస్తారు. దీంతో ఇద్దరి ఆలోచనలు, ఫ్యూచర్ ప్లాన్స్ లు ఒకరితో మరోకరు పంచుకుంటారు. దీని వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తారు. కానీ..  కొందరు మాత్రం తమ అవసరాల కోసం ఎదుటి వాళ్లను ప్రేమిస్తున్నట్లు నటిస్తుంటారు. తీరా అవసరాలు తీరిపోయాక.. ముఖం చాటేస్తుంటారు.

Read More: Cockroach: బొద్దింకలతో విసిగిపోయారా..?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీ ఇంట్లో అస్సలు కన్పించవు..

గుడ్డిగా ప్రేమలో ఉన్న వారు .. ఎదుటి వారి మాటలను పూర్తిగా నమ్మేస్తుంటారు. వీరి వీక్ నెస్ ను ఆసరాగా చేసుకున్న వాళ్లు.. డబ్బులను, శారీరంగా వాడుకుని తీరా పెళ్లి అనేసరికి మోసం చేస్తుంటారు. గొడవలు పడి, అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. ఇలా మోసాలు చేయడంలో అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరు కూడా అతీతులు కాదు.  అచ్చం ఇలాంటి ఘటన ఇప్పుడు వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు..

మధ్య ప్రదేశ్‌ కు చెందిన 28 ఏళ్ల యువకుడికి సోషల్ మీడియాలో శుక్లా అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.అదికాస్త కొన్నిరోజులకు ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి ఉండాలనుకున్నారు. శుక్లా యువకుడిని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇతగాడి మాటలు నమ్మిన బాధితుడు.. లింగ మార్పిడి చేసుకుని ఆడపిల్లగా మారాడు. ఆతర్వాత కొన్నిరోజులు జాలీగా ఎంజాయ్ చేశారు. ఆడపిల్లగా మారిన యువకుడిని ఫుల్ గా తన శారీరక సుఖాలకు ఉపయోగించుకున్నాడు.

Read More: Aishwarya Lekshmi: ఐశ్వర్య లక్ష్మీ మైండ్ బ్లోయింగ్ హాట్ షో, పిక్స్ వైరల్

చాలా సార్లు సదరు యువతితో అసహజంగా శారీరంగా కలవాలని బలవంతం కూడా చేశాడు.  ఈక్రమంలోనే చివరకు పెళ్లి చేసుకొవాలని యువతి బలవంతం చేయడంతో ముఖం చాటేశాడు. నాకు సంబంధం లేదని కూడా తెల్చిచెప్పాశాడు. చివరకు మోసపోయానని గ్రహించిన యువతిలా మారిన యువకుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పుడు ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News