ఫైర్‌బ్రాండ్ మమతా బెనర్జీ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. ఇటు కేంద్రం, అటు యూపీ ప్రభుత్వాల్ని టార్గెట్ చేశారు. అసలేం జరుగుతోందంటూ ప్రశ్నించారు. మమతా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
గత కొద్దికాలంగా మౌనంగా ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి , ఫైర్‌బ్రాండ్ మమతా బెనర్జీ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు యూపీ ప్రభుత్వం రెండింటినీ టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. బెంగాల్ ప్రజలు దీటైన సమాధానం చెబుతారని స్పష్టం చేశారు. బయటివ్యక్తులు రాష్ట్రాన్ని నడపలేరని..కొంతమందికి రాజకీయ అనుభవమే లేదని మమతా దుయ్యబట్టారు. హత్యల గురించి మాట్లాడటం, ఆరోపణలు చేయడమే తెలుసని ఆమె అన్నారు.
What is happening in Uttar Pradesh? People in that state are afraid of lodging complaints with the police. Several policemen were killed in a single incident: West Bengal Chief Minister Mamata Banerjee https://t.co/r9dqf4GWyH
— ANI (@ANI) July 21, 2020
మరోవైపు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేశారు మమతా బెనర్జీ. అసలు యూపీలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. అక్కడి ప్రజలైతే పోలీసులకు ఫిర్యాదు చేయడానికే భయపడుతున్నారని విమర్శించారు. ఓ సంఘటనలో పోలీసులే హత్యకు గురవడం శోచనీయమని మమతా బెనర్జీ తెలిపారు.
పశ్చిమబెంగాల్ లో ప్రతియేటా జరిపే షహీద్ దివస్ సందర్బంగా ఆమె మాట్లాడారు. పోలీసుల దౌర్జన్యాలకు బలైన అమరులకు శ్రద్ధాంజలి ఘటించిన ఆమె కీలకమైన వ్యాఖ్యలు చేశారు. శాంతియుతంగా ప్రదర్శన జరుపుతున్నవారిపై పోలీసులు కాల్పులు జరిపారని...అమరుల ప్రాణత్యాగాన్ని ఎన్నటికీ మరువలేమన్నారు మమతా బెనర్జీ.