దేశ రాజధాని ఢిల్లీని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు వందల సంఖ్యలోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 381 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 7 వేలకు సమీపంలో ఉంది.
ఢిల్లీలో మొత్తంగా ఇప్పటి వరకు 6 వేల 923 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐతే అందులో 75 శాతం కేసులు లక్షణాలు లేనివేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. చాలా మందికి ఇళ్లల్లోనే చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు కేవలం 1476 మందికి మాత్రమే ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నామన్నారు. ఢిల్లీలో కరోనా బారిన పడి 73 మంది చనిపోయారు. వారిలో 82 శాతం మంది 50 ఏళ్లకు పైబడిన వారేనని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే పెద్ద వయసు వారికే కరోనా వల్ల ముప్పు ఎక్కువ అన్నారు.
#WATCH Delhi CM Arvind Kejriwal briefs the media over COVID19 https://t.co/3H1ua9BKiP
— ANI (@ANI) May 10, 2020
మరోవైపు వలస కూలీలు ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాలకు కాలి నడకన వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు అరవింద్ కేజ్రీవాల్. వలస కూలీలకు ఢిల్లీలో అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు వారి బాధ్యత పూర్తిగా తీసుకుంటామని చెప్పారు. కాబట్టి వలస కూలీలు ఎవరూ ఢిల్లీ వదిలిపెట్టి వెళ్లవద్దని కోరారు. అది వలస కూలీలకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..