Uddhav Thackeray Resigned: ఉద్ధవ్ థాకరే రాజీనామా.. అసెంబ్లీలో బలపరీక్షకు ముందు మహారాష్ట్రలో కీలక పరిణామం

Uddhav Thackeray Resigned: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రేపు గురువారం మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్షపై స్టే కోరుతూ ఉద్ధవ్ థాకరే సర్కారు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2022, 10:31 PM IST
  • మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక పరిణామం
  • ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ థాకరే రాజీనామా
  • మహారాష్ట్రలో తర్వాతేం జరగనుంది ?
Uddhav Thackeray Resigned: ఉద్ధవ్ థాకరే రాజీనామా.. అసెంబ్లీలో బలపరీక్షకు ముందు మహారాష్ట్రలో కీలక పరిణామం

Uddhav Thackeray Resigned: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రేపు గురువారం మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్షపై స్టే కోరుతూ ఉద్ధవ్ థాకరే సర్కారు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదు. అసెంబ్లీలో శివసేన పార్టీ విశ్వాస పరీక్ష నెగ్గడం కష్టమనే పరిస్థితుల్లో ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి స్థానంతో పాటు తన శాసనమండలి సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్టు ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.

మహారాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో పడినప్పటి నుంచి ఇప్పటికే రెండు, మూడు సందర్భాల్లో దాదాపు రాజీనామా చేసే వరకు వెళ్లిన ఉద్ధవ్ థాకరే.. వీలైనంత వరకు తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ వచ్చారు. అందులో భాగంగానే సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించారు. కానీ మహారాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చిచెప్పడంతో చివరకు ఉద్ధవ్ థాకరే రాజీనామాకే ( Uddhav Thackeray On His Resignation ) మొగ్గుచూపాల్సి వచ్చింది.

Also read : EPFO Alert: పీఎఫ్‌ ఖాతాదారులారా అలర్ట్ అలర్ట్..ఈపీఎఫ్‌వో కీలక హెచ్చరికలు..!

Also read : Naveen Kumar Jindal: ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్త వాతావరణం..కొనసాగుతున్న బెదిరింపుల పర్వం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News