eknath shinde: 'మహా' డ్రామాలో కొత్త ట్విస్ట్..సీఎంగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే..!

eknath shinde: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే కొత్త సీఎం కానున్నారు. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.

Written by - Alla Swamy | Last Updated : Jun 30, 2022, 08:08 PM IST
  • 'మహా' డ్రామాలో కొత్త ట్విస్ట్
  • సీఎంగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే
  • ఉద్దవ్‌ తీరుపై ఫడ్నవీస్ ఫైర్
eknath shinde: 'మహా' డ్రామాలో కొత్త ట్విస్ట్..సీఎంగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే..!

eknath shinde: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే కొత్త సీఎం కానున్నారు. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఇవాళ రాత్రి 7.30 గంటలకు మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే ప్రమాణస్వీకారం చేస్తారు. అంతకుముందు మహారాష్ట్ర గవర్నర్ కోషియారీతో ఫడ్నవీస్, షిండే భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై మంతనాలు జరిపారు. గవర్నమెంట్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.  

ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేశారు. అనంతరం ఫడ్నవీస్, షిండే మీడియా ముందుకు వచ్చారు. ఈసందర్భంగా ఉద్దవ్ ఠాక్రే తీరుపై బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఫైర్ అయ్యారు. 2019లో బీజేపీ, శివసేన కూటమికే జనం పట్టం కట్టారని కానీ ఉద్దవ్ ద్రోహం చేశారని చెప్పారు. ఫలితాల తర్వాత యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. బాల్ ఠాక్రే ఆశయాలను ఉద్దవ్ ఆ రోజు తూట్లు పొడిచారని విమర్శించారు.

ఉద్దవ్ హయాంలో అభివృద్ధి అన్నది జరగలేదన్నారు దేవేంద్ర ఫడ్నవీస్. హిందుత్వం, సావర్కర్‌ను ప్రతి రోజూ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షిండేనే శివసేనకు శాసనపక్ష నేత అని స్పష్టం చేశారు. శివ సైనికులంతా కాంగ్రెస్‌,ఎన్సీపీపై ఆగ్రహంగా ఉన్నారని గుర్తు చేశారు. రాజకీయ ప్రత్యర్థులతో ఉద్దవ్ చేతులు కలిపారని మండిపడ్డారు. అందుకే షిండే వర్గం బయటకు వచ్చి తమతో కలిశారని చెప్పారు.

Also read: PM Modi Tour in AP: జులై 4న అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు..పాల్గొననున్న ప్రధాని..!

Also read: Southwest Monsoon: దేశ రాజధానిని తాకిన నైరుతి రాగం..ఉత్తరాధిలోనూ ఇక భారీ వర్షాలే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News