Mumbai New Airport: ముంబై సమీపంలో పాల్ఘర్ వద్ద మరో విమానాశ్రయం

Mumbai New Airport: దేశ ఆర్ధిక రాజధాని ముంబై సమీపంలో మరో విమానాశ్రయం రానుంది. భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని పాల్ఘర్‌లో మరో విమానాశ్రయం నిర్మించాల్సిన అవసరముందని మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే తెలిపారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 31, 2021, 03:26 PM IST
 Mumbai New Airport: ముంబై సమీపంలో పాల్ఘర్ వద్ద మరో విమానాశ్రయం

Mumbai New Airport: దేశ ఆర్ధిక రాజధాని ముంబై సమీపంలో మరో విమానాశ్రయం రానుంది. భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని పాల్ఘర్‌లో మరో విమానాశ్రయం నిర్మించాల్సిన అవసరముందని మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే తెలిపారు. 

దేశ ఆర్ధిక రాజధాని ముంబై(Mumbai)బిజీగా మారిపోతోంది. విమానాశ్రయం రద్దీ ఎక్కువై ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగర భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని..పాల్ఘర్‌లో మరో విమానాశ్రయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే (Aditya Thackeray)వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ముంబైలోని విమానాశ్రయం పూర్తిస్థాయిలో వినియోగంలో ఉండగా, నవీ ముంబైలో నిర్మిస్తున్న విమానాశ్రయం కూడా భవిష్యత్‌ అవసరాలను తీర్చలేదని, అందుకే పాల్ఘర్‌లో మూడో విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం కరోనా కోరల్లో నలుగుతున్న సమయంలో కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

పర్యటన్‌ పరిషద్‌ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముంబైలో కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ 50 మీటర్ల వరకు నిర్ధారించామని, కొంకణ్‌ ప్రాంతం విషయంలో కూడా జనవరి వరకు శుభవార్త వినే అవకాశం ఉందన్నారు. ముంబై, ఠాణే, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్, మరాఠ్వాడా, విదర్భతో సహా రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక స్థలాల్ని అభివృద్ధి పరిచేందుకు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి ఆదిత్య థాక్రే తెలిపారు. ముంబైతో పోల్చితే పాల్ఘర్‌లో మౌలిక సదుపాయాల కొరత ఎక్కువగా ఉందని, అందుకే ఈ ప్రాంతంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్తులో ముంబై, నవీ ముంబైలోని విమానాశ్రయాల సేవలు సరిపోవని, అందుకే పాల్ఘర్‌లో విమానాశ్రయాన్ని(Palghar Airport) నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒక విమానాశ్రయాన్ని నిర్మించేందుకు పట్టే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెడుతున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు 24 గంటల పాటు తెరిచే ఉంటున్నాయని, దాంతో ఆయా నగరాలు, ప్రభుత్వాల ఆదాయం పెరిగిందని చెప్పారు. 

Also read: RGV Aasha Trailer: ఆశ మూవీపై ఆర్జీవీ ఏమంటున్నాడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News