Eknath Shinde: శివసేన సంక్షోభానికి తెరదింపేందుకు ఠాక్రేతో చర్చిస్తున్నాం..షిండే సంచలన వ్యాఖ్యలు..!

Eknath Shinde: మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. శివసేన గుర్తు చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఈక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 9, 2022, 09:17 PM IST
  • మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా
  • శివసేనలో కొనసాగుతున్న సంక్షోభం
  • తాజాగా షిండే సంచలన వ్యాఖ్యలు
Eknath Shinde: శివసేన సంక్షోభానికి తెరదింపేందుకు ఠాక్రేతో చర్చిస్తున్నాం..షిండే సంచలన వ్యాఖ్యలు..!

Eknath Shinde: ఢిల్లీ పర్యటనలో ఉన్న మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే..శివసేన సంక్షోభంపై స్పందించారు. పార్టీ గుర్తుకోసం పోరాటం అనేది తన ఒక్కడి నిర్ణయం కాదని..ఇతర సభ్యులతో చర్చించాలన్నారు. వారు ఏది నిర్ణయిస్తే..దాని ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. శివసేన సంక్షోభాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని..మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేను ఒప్పిస్తున్నామని చెప్పారు.

ఐతే ఆ అభ్యర్థులు ఫలించడం లేదన్నారు. ఐనా శాంతి చర్చలు జరుపుతామని తెలిపారు. మహారాష్ట్ర ప్రజల మేరకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. మహా వికాస్ అగాడి కూటమిలో శివసేన ఎమ్మెల్యేలకు గౌరవం లేకుండా పోయిందని విమర్శించారు. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశార ఏక్‌నాథ్‌ షిండే. మరోవైపు ఈనెల 11న ఎమ్మెల్యే అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. 

ఢిల్లీకి వచ్చిన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే బిజీ బిజీగా గడిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనున్నడంతో ఈభేటీపై ఆసక్తి నెలకొంది. ఆయన వెంట డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ కూడా ఉన్నారు. ఇటీవల మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు దారులు, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Also read:Ram Charan: బాలీవుడ్ పై కన్నేసిన రామ్ చరణ్.. బంగ్లా కొనుగోలు.. ఈసారి తగ్గేదేలే అంటూ

Also read:Kodali Nani: చంద్రబాబుకు ఇక రాజకీయ సమాధే..టీడీపీపై కొడాలి నాని హాట్ కామెంట్స్..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News