Maharashtra Covid 19 cases: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 43,211 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 19 మంది కరోనాతో మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క ముంబై నగరంలోనే 11,317 కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. నగరంలో 136 మంది పోలీస్ సిబ్బంది కరోనా బారినపడ్డారు. ఇప్పటికే కరోనాతో 126 మంది పోలీస్ సిబ్బంది మరణించగా... మరో 136 మందికి కరోనా సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Maharashtra | 136 police personnel tested positive for COVID in the last 24 hours. Total 126 personnel died so far; Active cases 1,253: Mumbai Police
— ANI (@ANI) January 14, 2022
మహారాష్ట్రలో నిన్నటి కన్నా 3195 కేసులు తక్కువగా నమోదయ్యాయి. కొత్తగా మరో 238 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1605కి చేరింది. కరోనా కేసులను (Covid 19 cases) కట్టడి చేసేందుకు ప్రస్తుతం అక్కడ రాత్రి కర్ఫ్యూ అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ ఇప్పట్లో నిబంధనలు సడలించేది లేదని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే ఇటీవల వెల్లడించారు. ఇప్పటికీ కొంతమంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు సందేహిస్తున్నారని... ఈ నేపథ్యంలో కేంద్రం వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రి రాజేష్ కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం ముంబైలో అంబులెన్స్‌ల ద్వారా విస్తృతంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారు.
Also Read: UP Polls: యూపీలో కొత్త రాజకీయ సమీకరణాలు, చంద్రశేఖర్ ఆజాద్‌తో చేతులు కలపనున్న అఖిలేశ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook