Lucknow Wall Collapse: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో విషాదం నెలకొంది. లక్నోలో కురిసిన భారీ వర్షానికి గోడకూలి 10 మంది మృతి చెందారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించికిత్స అందించారు. లక్నో దిల్‌ఖుషా ప్రాంతంలో శుక్రవారం తెలవారు జామున ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి.
లక్నోలో గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షాల కారణంగా దిల్‌ఖుషా ఏరియాలోని ఆర్మీ ఎన్‌క్లేవ్ గోడ కూలిపోయింది. ఆర్మీ ఎన్‌క్లేవ్ గోడను ఆనుకుని ఉన్న గుడిసెల్లో కొందరు కార్మికులు నివసిస్తున్నారు. గోడ కూలిపోవడంతో గుడిసెల్లో ఉన్న 10 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో పిల్లలు కూడా మృతి చెందారు. ఈ ఘటనలో 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
UP | Nine people dead and 2 injured after a wall collapsed due to heavy rain in Lucknow. The incident took place in Dilkusha under Cantt: Home Department pic.twitter.com/Kxmml42KBe
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 16, 2022
ఇరవై నాలుగు గంటల నుంచి కురుస్తున్న వర్షం కారణంగానే గోడ కూలి ప్రమాదం జరిగిందని లక్నో పోలీస్ జాయింట్ కమిషనర్ పీయూష్ మోర్డియా వెల్లడించారు. మృత దేహాలను ఘటన జరిగిన వెంటనే దిబ్బల నుంచి వెలికి తీశామని, ఒకరు సజీవంగా బయటపడ్డారని ఆయన తెలిపారు. ఇక ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారికి రూ. 4లక్షలు, గాయపడిన వారికి రూ. 2లక్షల పరిహారాన్ని సీఎం ప్రకటించారు.
Also Read: IND vs AUS: భారత్ vs ఆస్ట్రేలియా పూర్తి షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్‌లో మూడో టీ20!
Also Read: ట్రైన్‌లో చోరీకి ప్రయత్నం.. దొంగకు భలేగా బుద్ధి చెప్పిన ప్రయాణికుడు! 15 కిలోమీటర్ల పాటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook