LPG Cylinder Price: బిగ్ రిలీఫ్... భారీగా తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర... ఏయే నగరాల్లో ఎంతంటే..

LPG Cylinder Price: ధరల పెరుగుదలతో సతమతమవుతున్న వేళ ఆయిల్ కంపెనీలు కమర్షియల్ ఎల్‌పీజీ వినియోగదారులకు బిగ్ రిలీఫ్ ప్రకటించాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 1, 2022, 10:43 AM IST
  • కమర్షియల్ సిలిండర్‌పై భారీగా ధర తగ్గింపు
  • 19కేజీల సిలిండర్‌పై రూ.135 మేర ధర తగ్గించిన ఆయిల్ కంపెనీలు
  • తగ్గిన ధరలతో ఏయే నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే...
 LPG Cylinder Price: బిగ్ రిలీఫ్... భారీగా తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర... ఏయే నగరాల్లో ఎంతంటే..

LPG Cylinder Price: వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్‌పీజీ కమర్షియల్ సిలిండర్‌ ధరపై ఆయిల్ కంపెనీలు బిగ్ రిలీఫ్ ప్రకటించాయి. 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ.135 మేర తగ్గించాయి. దీంతో రూ.2354గా ఉన్న ధర రూ.2219కి దిగొచ్చింది. ఆయిల్ కంపెనీలు ప్రతీ నెలా సిలిండర్ ధరలను సవరిస్తాయన్న సంగతి తెలిసిందే. ఇవాళ జూన్ 1వ తేదీ కావడంతో సిలిండర్ ధరలను సవరిస్తూ కొత్త ధరల వివరాలను విడుదల చేశాయి.

ఏయే నగరాల్లో ఎంత ధర :

ఢిల్లీలో ఇదివరకు రూ.2354గా ఉన్న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.2219కి దిగి వచ్చింది.

కోల్‌కతాలో ఇది వరకు రూ.2454గా ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.2322కి దిగి వచ్చింది.

ముంబైలో ఇదివరకు రూ.2306గా ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.2171.50కి దిగి వచ్చింది.

చెన్నైలో రూ.2507గా ఉన్న ధర ఇప్పుడు రూ.2373కి దిగివచ్చింది.

గత నెలలో రెండుసార్లు ధరల పెంపు:

కమర్షియల్ సిలిండర్‌పై భారీ తగ్గింపు ప్రకటించిన ఆయిల్ కంపెనీలు గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధరను మాత్రం తగ్గించలేదు. సాధారణంగా ప్రతీ నెలా మొదటి తేదీన సిలిండర్ ధరలు సవరించే ఆయిల్ కంపెనీలు గత నెలలో రెండుసార్లు ధరలను సవరించాయి. మే 1వ తేదీన కమర్షియల్ సిలిండర్ ధరను రూ.102.50 మేర పెంచాయి. ఆ తర్వాత మే 19న కమర్షియల్ సిలిండర్‌పై రూ.8, డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.3.50 మేర పెంచాయి. కమర్షియల్ సిలిండర్ ధర పెంపు చిరు వ్యాపారులకు భారంగా మారింది. తాజాగా భారీ తగ్గింపు ప్రకటించడం వారికి కాస్త ఊరటనిచ్చినట్లయింది.

Also Read: Krishnakumar Kannath: ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ కన్నత్ హఠాన్మరణం... విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ...

Also Read: Sidhu Moose Wala: మీసాలు దిద్ది.. పెళ్లి కొడుకులా అలంకరించి సిద్ధూ మూసే వాలా అంత్యక్రియలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News