Lok Sabha Opposition Leader: 2024లో 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 272 సీట్లకు గాను సొంతంగా 240 సీట్లను గెలుచుకుంది. కానీ కూటమితో కలిపి 292 సీట్లతో మూడోసారి తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలతో దిగువ సభలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ సారి ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు సరిపోయేంత సీట్లు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. అయితే.. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యత ఏమిటి.. ? ఆయనకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయనే విషయానికొస్తే..
లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడి పదవి కేంద్ర కేబినేట్ మంత్రితో సమానమైన హోదా ఉంటుంది.
క్యాబినేట్ మంత్రితో సమానంగా జీత, భత్యాలు, ఇతర అలవెన్సులు, సౌకర్యాలు ఉంటాయి.
ఢిల్లీలో క్యాబినేట్ మంత్రులుండే ఇంటిని కేటాయిస్తారు. అంతేకాదు డ్రైవరు సహా కారు సదుపాయం ఉంటాయి.
లోక్ సభలో ప్రతిపక్ష నేతకు ప్రత్యేకంగా వ్యక్తిగత సిబ్బంది కేటాయించుకునే సదుపాయం ఉంటుంది.
లోక్ సభలో అపోజిషన్ లీడర్ పబ్లిక్ అండర్ టేకింగ్స్, పబ్లిక్ అకౌంట్స్ కమిటి, పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటిల్లో సభ్యుడిగా ఉంటారు.
పార్లమెంటులో ఏర్పాటు చేసే పలు జాయింట్ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా ఉంటారు.
అంతేకాదు సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిటి, సెంట్రల్ ఇన్ ఫర్మేషన్ కమిషన్, ఎన్ హెచ్ ఆర్సీ కేంద్రం నియమించే సెలక్షన్ కమిటీలలో లోక్ సభ ప్రతిపక్ష నేత సభ్యుడి ఉంటారు. అంతేకాదు పార్లమెంట్ లో గవర్నమెంట్ పాలసీలను విమర్శించే స్వేచ్ఛ అపోజిషన్ లీడర్ కు ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter