Punjab CM Mann: పంజాబ్ సీఎం నివాసానికి సమీపంలో లైవ్ బాంబు.. చండీఘడ్‌లో హై అలర్ట్

Bomb Threat For Punjab CM Bhagwant Mann: బోర్‌వెల్ ఆపరేటర్ ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పంజాబ్ పోలీసులు.. అక్కడ లైవ్ బాంబు షెల్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌కి సమాచారం అందించారు. అదే సమయంలో ఇండియన్ ఆర్మీ వెస్టెర్న్ కమాండ్‌కి సైతం పోలీసులు సమాచారం అందించారు.

Written by - Pavan | Last Updated : Jan 2, 2023, 06:04 PM IST
Punjab CM Mann: పంజాబ్ సీఎం నివాసానికి సమీపంలో లైవ్ బాంబు.. చండీఘడ్‌లో హై అలర్ట్

Bomb Threat For Punjab CM Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసానికి సమీపంలో లైవ్ బాంబు బయటపడటం కలకలం సృష్టించింది. చండీఘడ్‌లో సీఎం భగవంత్ మాన్ నివాసానికి 500 మీటర్ల దూరంలోని హెలిప్యాడ్ వద్ద లైవ్ బాంబు లభించిన నేపథ్యంలో పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి 4-30 గంటల మధ్య సీఎం హెలీప్యాడ్‌కి సమీపంలోని మామిడి తోట మధ్యలో లైవ్ బాంబు షెల్ ఉన్నట్టు గుర్తించిన ట్యూబ్ బోర్‌వెల్ ఆపరేటర్.. ఆ విషయాన్ని పోలీసులకు తెలిపారు. 

బోర్‌వెల్ ఆపరేటర్ ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పంజాబ్ పోలీసులు.. అక్కడ లైవ్ బాంబు షెల్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌కి సమాచారం అందించారు. అదే సమయంలో ఇండియన్ ఆర్మీ వెస్టెర్న్ కమాండ్‌కి సైతం పోలీసులు సమాచారం అందించారు. లైవ్ బాంబు దొరికిన సమయంలో సీఎం భగవంత్ మాన్ తన నివాసంలో లేరని తెలుస్తోంది. 

 

పంజాబ్ సీఎం అధికారిక నివాసానికి సమీపంలోనే లైవ్ బాంబు లభించడంతో ఆ బాంబును అక్కడికి ఎవరు తీసుకొచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీఎం భగవంత్ మాన్ నివాసానికి దారితీసే అన్ని మార్గాల్లోని సెక్యురిటీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలిస్తూ అనుమానితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : Supreme court collegium: సుప్రీంకోర్టు కొలిజీయంపై మరో వివాదం, కులాల కుంపటి రాజేసినట్టేనా

ఇది కూడా చదవండి : Covid 4th Wave in India: కొవిడ్ ఫోర్త్ వేవ్ రానుందా ? కేంద్రం ఏం చెబుతోంది ?

ఇది కూడా చదవండి : Free Ration Scheme: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 2023 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News