భారీ వర్షాలు, పిడుగులు.. రెండు రాష్ట్రాల్లో 115 మంది మృతి

lightning strikes | ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు బిహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో కురిసిన  భారీ వర్షాలు, పిడుగుపాటుల కారణంగా మరణించిన వారి సంఖ్య 115కి చేరింది. దీంతో ప్రభుత్వం పదిజిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు

Last Updated : Jun 26, 2020, 12:02 PM IST
భారీ వర్షాలు, పిడుగులు.. రెండు రాష్ట్రాల్లో 115 మంది మృతి

బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో కురుస్తున్న భారీ వర్షాలు (Rains) ఆ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో పిడుగులు పడ్డాయి. దీంతో ఏకంగా 115 మంది మరణించారు. బిహార్‌లోని పలు జిల్లాల్లో గురువారం పిడుగులు (Lightning Strike) పడటంతో మరణించినవారి సంఖ్య 92కి చేరిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (Bihar state disaster management authority) పేర్కొంది. పదిజిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయని ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించింది. ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో దారుణం.. బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం

మరణించిన వారిలో ఎక్కువమంది పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలే ఉన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రుల్లో చేర్పించారు. ఒక్క గోపాల్‌గంజ్ జిల్లాలోనే అత్యధికంగా 13 మంది మృతి చెందారని విపత్తు నిర్వహణ పేర్కొంది. ఇప్పటికే బిహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. Photos: జబర్దస్త్ యాంకర్ అనసూయ హొయలు

యూపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, పిడుగుల కారణంగా రాష్ట్రంలో 23 మంది వరకు చనిపోయినట్లు సమాచారం. యూపీలోకి రుతుపవనాలు ప్రారంభానికి ముందే ఉరుములు, మెరుపులు(Thunderstorms), పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
 

Trending News