Best LIC Plan: ఎల్ఐసీ. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలోని అతిపెద్ద బీమా రంగ సంస్థ. చాలా ఏళ్లుగా విభిన్న రకాల ప్లాన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. సెక్యూరిటీ, టెర్మ్ ఇన్సూరెన్స్‌లో ఎల్ఐసీని మించింది మరొకటి లేదనే చెప్పాలి. అన్ని వర్గాలవారికి అవసరమయ్యే పాలసీలు ఇందులో ఉంటాయి. ఎల్ఐసీ అందిస్తున్న జీవన ఆనంద్ పాలసీ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.
ఎల్ఐసీ అందిస్తున్న జీవన్ ఆనంద్ పాలసీ చాలా ప్రత్యేకమైంది. ఇందులో రోజుకు కేవలం 45 రూపాయలు సేవ్ చేస్తే చాలు..మెచ్యూరిటీ అనంతరం ఏకంగా 25 లక్షలు కూడగట్టవచ్చు. తక్కువ మొత్తం ప్రీమియంతో పెద్దమొత్తం ఫండ్ సమీకరించేందుకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇదో రకమైన టెర్మ్ పాలసీ వంటిది. మెచ్యూరిటీ అనంతరం చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో కనీసం 1 లక్ష నుంచి గరిష్టంగా ఎంతైనా చేయవచ్చు. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో రోజుకు కేవలం 45 రూపాయలు అంటే నెలకు 1358 రూపాయలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తరువాత ఏకంగా 25 లక్షల భారీ నగదు అందుతుంది. రోజుకు 45 రూపాయల చొప్పున 35 ఏళ్లు జమ చేస్తుండాలి. 35 ఏళ్ల తరువాత ఒకేసారి 25 లక్షల మొత్తం డ్రా చేయవచ్చు. రోజుకు 45 రూపాయలంటే ఏడాదికి మీరు జమ చేసేది 16,300 రూపాయలు.
ఏడాదికి 16,300 రూపాయల చొప్పున జీవన్ ఆనంద్ పాలసీలో 35 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే మీరు చేసే మొత్తం డిపాజిట్ విలువ 35 ఏళ్లకు 5,70,500 రూపాయలు మాత్రమే. కానీ రివిజనరీ బోనస్ రూపంలో 8.60 లక్షల రూపాయలు లభిస్తాయి. ఇది కాకుండా ఫైనల్ బోనస్ 11.50 లక్షల రూపాయలు అందుతాయి. బోనస్ అనేది రెండుసార్లు లభిస్తుంది. ఇలా మొత్తం 25 లక్షలు తీసుకోవచ్చు.
అయితే జీవన్ ఆనంద్ పాలసీలో పాలసీదారుడికి ఎలాంటి ట్యాక్స్ మినహాయింపు లభించదు. కానీ ఇతర ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పాలసీలో యాక్సిడెంటల్ డెత్, డిజెబిలిటీ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టెర్మ్ ఇన్సూరెన్స్ రైడర్, న్యూ క్రిటికల్ బెనిఫిట్ రైడర్ ప్రయోజనాలు అందుతాయి. నామినీకు డెత్ బెనిఫిట్ కింద 125 శాతం పాలసీ అందుతుంది.
Also read: SBI PO Jobs: నిరుద్యోగులకు శుభవార్త, ఎస్బీఐలో భారీగా పీవో పోస్టుల భర్తీ, ఎలా అప్లై చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.