Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో వానలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజులపాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నిన్న ఉత్తర ఒడిశా, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ ఇంటీరియర్ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది.
మరోవైపు ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర-దక్షిణ ద్రోణి ఇవాళ దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి కొమరన్ ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు స్థిరంగా కేంద్రీకృతమైంది. వీటి ప్రభావంతో రాగల మూడురోజులపాటు తెలంగాణ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి.
మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి వెదర్ ఇలాగే ఉండనుంది. మరోవైపు ఏపీలోనూ ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం అధికంగా ఉంది. ఒడిశా తీరంలో ఇవి కొనసాగుతుండటంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. ఇవాళ కూడా అదే వాతావరణం కనిపించనుంది. రాయలసీమ జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి.
రానున్న నాలుగురోజులపాటు తెలంగాణలో పలు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంగనర్, భూపాలపల్లి, పెద్దపల్లి, కొత్తగూడెం, ములుగు, సిద్దిపేట, జనగామ, యాదాద్రి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో ఇదే వాతావరణం ఉండనుంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) July 23, 2022
Also read:Pushpa 2: పుష్ప 2కి కొత్త ఇబ్బందులు.. ఇప్పుడేం చేస్తారో?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.