Election Survey: ప్రధానిగా మోడీ కంటే రాహులే బెటర్! బీజేపీకి షాకిచ్చిన సర్వే..

Election Survey: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువుంది. అయినా అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు బూస్ట్ లభించింది. ఓ ఎన్నికల సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కంటే రాహుల్ గాంధీవైపే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 10:26 AM IST
  • ప్రధానిగా మోడీ కంటే రాహుల్ గాంధీ బెటర్
  • బీజేపీకి వ్యతిరేకంగా తమిళనాడు ప్రజలు
  • స్టాలిన్ పనితీరుపై 84 శాతం మంది సంతృప్తి
Election Survey: ప్రధానిగా మోడీ కంటే రాహులే బెటర్! బీజేపీకి షాకిచ్చిన సర్వే..

Election Survey: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువుంది. అయినా అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇటీవలే రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ చింతన్ శివిర్ నిర్వహించింది కాంగ్రెస్. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించింది. పార్టీ బలోపేతానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఏఐసీసీ. దేశ మొత్తం కవరయ్యేలా యాత్రకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ. అన్ని రాష్ట్రాలు తిరిగేలా రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు బూస్ట్ లభించింది. ఓ ఎన్నికల సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కంటే రాహుల్ గాంధీవైపే ఎక్కువ మంది ప్రజలు మొగ్గు చూపారు. ఈ సర్వే ఇప్పుడు కాంగ్రెస్ లో కొత్త జోష్ నింపుతోంది.

నరేంద్ర మోడీ కంటే రాహుల్ గాంధీకే ప్రధానిగా ఎక్కువ మంది ఓటేసినట్లు తేల్చిన సర్వే దేశవ్యాప్తంగా జరగలేదు. కేవలం తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే సంబంధించింది. ఇండో ఏషియన్‌ న్యూస్‌ సర్వీస్‌ అనే సంస్థ 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అసోం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో సర్వే చేసింది. అక్కడి ప్రభుత్వాల పనితీరును ఆరా తీసింది. రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ప్రజా స్పందన తెలుసుకుంటూనే.. ప్రధానమంత్రి విషయంలో సర్వే చేసింది. ఐఏఎన్‌ఎస్‌ తాజాగా వెల్లడించిన సర్వే ఫలితాల్లో తమిళనాడుకు సంబంధించి ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. దేశానికి కాబోయే ప్రధానమంత్రిగా ఎవరు బెటర్ అన్నప్రశ్నకు.. రాహుల్ గాంధీకే ఎక్కువ ప్రజాదరణ కనిపించింది. 54 శాతం మంది తమిళనాడు ప్రజలు రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. మోడీకి 32 శాతం మంది ఓటేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పనితీరుకు తమిళనాడు వాసులు తక్కువ మార్కులే వేశారు.

ప్రధానిగా మోడీ పని తీరు బాగుందని 17 శాతం మంది తమిళులు చెప్పగా.. 40 శాతం మంది జనాలు కాస్త బాగుందని తెలిపారు. 40 శాతం మంది ప్రజలు మోడీ పనితీరు బాగా లేదని చెప్పారని ఐఏఎన్‌ఎస్‌ సంస్థ వెల్లడించింది. ఇక సౌత్ ఇండియా ముఖ్యమంత్రులపై నిర్వహించిన సర్వేలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. పాలనలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు స్టాలిన్. ఆయన విధానాలు జాతీయ స్థాయిలోనూ చర్చగా మారాయి. తమిళనాడు ప్రజలు కూడా స్ఠాలిన్ పనితీరుపై సంతోషంగా ఉన్నట్లు తాజా సర్వేలో తేలింది. 2021లో పోల్చితే స్టాలిన్ గ్రాఫ్ మరింత పెరిగిందని ఇండో ఏషియన్‌ న్యూస్‌ సర్వీస్‌ నిర్వాహకులు చెప్పారు. స్టాలిన్ పనితీరుపై ఏకంగా 85 శాతం తమిళ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత భారీ స్థాయిలో జనాల మద్దతు పొందడం చిన్న విషయం కాదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. సీఎంగా స్టాలిన్ కు జైకొడుతున్న తమళి తంబీలు.. ప్రధానిగా మోడీ కంటే రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపడం ఆసక్తిగా మారింది. బీజేపీ పట్ల తమిళనాడు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తాజా సర్వే నిదర్శనంగా నిలుస్తుందని చెబుతున్నారు.

READ ALSO: Gaddar Meet Amit sha: అమిత్ షాను గద్దర్ ఎందుకు కలిశారు? బీజేపీ సభలో అసలేం జరిగింది?

READ ALSO: MLC Anantha Babu: కారు డ్రైవర్ ను ఎమ్మెల్సీనే కొట్టి చంపాడా? అనంతబాబు అరెస్ట్ కు జాప్యమెందుకు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x